ఓఆర్‌ఆర్‌ టెండర్లపై సమగ్ర విచారణ చేపట్టాలి

– సీఎం కేసీఆర్‌కు బండి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఔటర్‌ రింగ్‌రోడ్డు టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బహిర్గతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఓఆర్‌ఆర్‌పై ఏటా రూ.415 కోట్ల ఆదాయం వస్తున్నదనీ, ఏటా ఐదు శాతం పెంచుకుంటూ పోయినా 30 ఏండ్లకు రూ.30 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రాష్ట్ర సర్కారు ఈ ఆలోచన చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు.

Spread the love