కార్మికులకు అండగా సీఐటీయూ

– వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌.మహిపాల్‌
– ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
కార్మికులకు అండగా సీఐటీయూ ఉంటుందని ఆ సంఘం వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌. మహిపాల్‌ అన్నారు. వికారాబాద్‌ పట్టణంలో సీఐటీయూ కార్యాలయంలో సీఐటీయూ 53వ ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించా రు. సీఐటీ యూ జిల్లా నాయకులు చంద్రయ్య సీఐటీయూ జెండాను ఎగురవేశా రు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహిపాల్‌ మాట్లాడుతూ దేశంలో సీఐటీయూ ఏర్పడి 53 ఏండ్లు అవుతోందన్నారు. కార్మిక, కర్షకుల తరపున పోరా డుతోందన్నారు. వారి పక్షాన నిలబడి నిర్భయంగా పోరాటాలు చేస్తూ కార్మికులకు అండగా నిలుస్తోందన్నారు. నాటి నుంచి నేటి వరకు అనేక పోరాటాలు చేసి అనే విజయాలు సాధించిన ఘనత ఎర్రజెండా సీఐటీయూకే దక్కిందన్నారు. కంపెనీ, ఖర్జానా, ప్రభుత్వ రంగ సంస్థలలో పనులు చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై కేంద్ర, రాఊ ప్రభుత్వాలపై రాజీ లేని పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. కార్మికులు న్యా యం జరిగే వరకూ పోరాటాలు, సమ్మెలు చేస్తోందన్నారు. అందుకే ఇంకా రాబోయే కాలం లో అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు ఎర్రజెండా కిందికి రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా నాయకులు ఈ. చంద్రయ్య, మున్సిపల్‌ యూ నియన్‌ కార్యదర్శి శంకర్‌, మరన్న సుద ర్శన్‌, శ్రీనివాస్‌, సతీష్‌, అక్బర్‌, రాజు, దవిదీ పాల్గొన్నారు.

Spread the love