కోదాడ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

నవతెలంగాణ – హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులకు సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బైపాస్‌ రోడ్డుపై తెల్లవారుజాము ఐదున్నర గంటల ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్‌ చిన్నకుమార్తె లావణ్య చెవులు కుట్టించేందుకు… శ్రీకాంత్‌ దంపతులు, అత్తామామ.. వారి కుమార్తె, అల్లుడు, వారి పిల్లలు మొత్తం పదిమంది కారులో తెల్లవారుజామున విజయవాడలోని గుణదల చర్చ్‌కు హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. ఐదున్నర గంటల ప్రాంతంలో కోదాడ బైపాస్‌ వద్దకు రాగా.. ఇదే సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన వీరి కారు బలంగా ఢీకొట్టింది.

Spread the love