మట్టిపల్లి సైదులుపై పోలీసుల దాడిని ఖండించండి

నవతెలంగాణ-చివ్వెంల
మోతె మండలం విభాలపురంలో ఆదివారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లలో లబ్దిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలను అరికట్టాలని అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్లు ఇండ్లు కేటాయించాలని ఆందోళన చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సీపీఐ(ఎం) మోతె మండలకార్యదర్శి గోపాల్‌రెడ్డి, సీపీఐ(ఎం) నాయకులపై పోలీసుల దాడులను ప్రజాతంత్రవాదులు, మేధావులు ఖండించాలని సీపీఐ(ఎం) మండలకార్యదర్శి బచ్చలకూరి రామ్‌చరణ్‌ డిమాండ్‌ చేశారు.ఆదివారం మండలంలోని వల్లభాపురంలో నిర్వహించిన గ్రామశాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. విభాలపురం గ్రామంలో లబ్దిదారుల ఎంపికను అధికారులు ఏకపక్షంగా చేశారని, అర్హులైన పేదలకు అందడం లేదన్నారు.ఎంపికలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు.సామరస్యంగా ఆందోళన చేస్తున్న సీపీఐ(ఎం) నాయకులపై పోలీసులు దాడి చేయడం అన్యాయ మన్నారు.స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకుల ప్రోత్సాహకంతోనే పోలీసులు దాడికి పాల్పడ్డారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు నాశబోయిన భూషయ్య, తుడుసు సోమయ్య, సీపీఐ(ఎం)శాఖ కార్యదర్శి దోనేటిపిచ్చయ్య, కాంపాటిఅబ్రహం, చంద్రయ్య పాల్గొన్నారు.
తుంగతుర్తి: వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులుపై మోతె ఎస్సై మహేష్‌ పరుషపదజాలం వాడి అమానుషంగా దాడి చేయడం హేయమైన చర్య అని, వెంటనే అతన్ని సస్పెండ్‌ చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.మండలకేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అన్నారు.శుక్రవారం మోతె మండలంలోని విబులాపురం గ్రామంలో అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని శాంతియుతంగా చేస్తున్న ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ పక్షపాతంగా ఇండ్లు, ప్లాట్లు ఉన్న వారికే డబుల్‌ బెడ్‌ రూములు ఇవ్వడం మంచిది కాదంటూ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న సందర్భంగా పోలీసులు దాడి చేసి ముఖ్య నాయకుడైన సైదులును నెట్టేసి కింద వేయపడేయడం మంచిదికాదన్నారు.ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఎమ్మెల్యే, పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
మోతె: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులుపై దాడి చేసిన ఎస్సై మహేష్‌పై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీసభ్యులు కాసాని కిశోర్‌ డిమాండ్‌చేశారు.నడిగూడెం మండలకేంద్రంలోని సుందరయ్య భవనం నిర్వహించిన డీివైఎఫ్‌ఐ మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు.మోతే మండలకేంద్రంలో విభాలపుం,అప్పన్నగూడెం గ్రామాల్లోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ అర్హులకు కాకుండా అనర్హులకు ఇవ్వడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై ఎస్సై దాడి చేయడం సరికాదన్నారు.ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి ఎస్సైను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ నాయకులు జమ్మి ఎల్లయ్య, సీన అంజి, వీరబాబు, సతీష్‌, వెంకి, దినేష్‌ పాల్గొన్నారు.
సూర్యాపేట: మట్టిపల్లి సైదులుపై, పేదమహిళలపై ఎస్సై మహేష్‌ దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని, ఈ దాడిని ఖండిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బానోత్‌ వినోద్‌, ధనియాకుల శ్రీకాంత్‌ వర్మ లు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వీఎన్‌ భవన్‌లో ఏర్పాటు చేసినవిలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.మోతె మండలం విభలాపురం, అప్పన్నగూడెం గ్రామాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు అర్హులకు కాకుండా, అనర్హులకు ఇవ్వడాన్ని నిరసిస్తూ శాంతి యుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై ఎస్సై మహేష్‌ విచక్షణ కోల్పోయి దాడి చేయడం సరికాదన్నారు.ఈ సమావేశంలో నాయకులు శ్రీనునాయక్‌, సుమన్‌, గోపి, వినరు,తదితరులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌రూరల్‌ :మోతె మండలం విభాలపురం గ్రామంలో ఆదివారం డబుల్‌బెడ్‌రూమ్‌ లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలను అరికట్టాలని, అర్హులైన పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కేటాయించాలని ఆందోళన చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గోపాల్‌రెడ్డి పై, సీపీఐ(ఎం) నాయకులపైన పోలీసులు మూకమ్మడిగా దాడి చేయటాన్ని ప్రజాతంత్ర వాదులు, మేధావులు ఖండించాలని, బాధ్యులైన పోలీసులపై చర్య తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యాక్షులు పోసనబోయిన హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల పరిధిలోని అమరవరం గ్రామశాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్సేన్‌ డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పంపిణీ సందర్భంగా విభాలపురం గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక అధికారులు ఏకపక్షంగా చేశారని, అర్హులైన పేదలకు అందటం లేదని, లబ్ధిదారుల ఎంపికల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ప్రజా సంఘాల నాయకులు షేక్‌ ఖాసీం, కదిర రామ నరసమ్మ, షేక్‌ సైదా, తేనే సీతారాములు, తేనే బాల సైదులు, కృష్ణారెడ్డి, సీఐటీయూ నాయకులు కందుల వీరస్వామి, బుద్దిబాల సైదులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌ నాయకుల అండదండలతోనే పోలీసుల దాడి
పెన్‌పహాడ్‌:బీఆర్‌ఎస్‌ నాయకుల ప్రోత్సాహంతోనే ప్రజా సంఘాల నాయకుడు మట్టపల్లి సైదులు, ఇతర నాయకులపై పోలీసులు దాడి చేశారని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మడ్డీ అంజిబాబు అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోతే మండలం విభళపురం గ్రామంలో అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం నాయకులపై పోలీసు దాడులు చేయడం దారుణమన్నారు. ఈ దాడిని అన్నివర్గాల ప్రజలు ఖండించాలని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నాయకులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తు వేయాలని అర్హులైన పేదల లిస్టు ఫైనల్‌ చేసి వారికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.
నాగారం:మోతే మండలం ఎస్సై మహేష్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని సీఐటీయూ జిల్లా అనుబంధ సంఘం అధ్యక్షులు అనంతుల మల్లయ్య అన్నారు. నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోతే మండలం విబులాపురం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ చేయాలని సీపీఐ(ఎం )ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీ జిల్లా సభ్యులు మట్టిపల్లి సైదులును గల్ల పట్టి విచక్షణరహితంగా చేసిన దాడిని ఖండిస్తున్నారన్నారు. జిల్లా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తక్షణమే ఎస్‌ఐ మహేష్‌ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఎలుక సోమయ్యగౌడ్‌, మండల ఉపాధ్యక్షులు వంగాల శేఖర్‌, మల్లెపాక సోమయ్య, రవిశంకర్‌, పానుగంటి వెంకన్న, మండల కార్మికులు పాల్గొన్నారు.

Spread the love