నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో నియోజకవర్గ జోన్ సమావేశం

నవతెలంగాణ – కంటేశ్వర్
కాంగ్రెస్ భవన్ నందు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశ వేణు ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ జోన్ సమావేశం మంగళవారం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గల ఇంఛార్జి శశికళ యాదవ రెడ్డి ,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ,పిసిసి ఉపాధ్యక్షులు తహెర్ బిన్ హాందన్, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్ నిజామాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ శశికళ యాదవ రెడ్డి మాట్లాడుతూ.. బిజెపి ,టీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు లోబాయికార ఒప్పందాలతో పనిచేస్తున్నారని, రెండు పార్టీలు ఒకటేనని ,బయటకు గొడవలు పడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆమె అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పార్టీ కార్యకర్తలు, నాయకులు మరింత ఉస్తహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.రేవంత్ రెడ్డి గారు పిసిసి అద్యక్షులు అయ్యాక క్షేత్ర స్తాయిలో పార్టీని బలోపతం చేసే దిశగా మండల, డివిజన్ కమిటీ లు వేసే ప్రక్రియను మొదలు పెట్టారని, కావున కాంగ్రెస్ నాయకులు పార్టీ కోసం పనిచేసే వారిని కమిటీల లోకి తీసుకోవాలని ఆమె అన్నారు.కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వములో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కి బహుమతిగా ఇవ్వాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపధ్యక్షుడు రమర్తి గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, ఓ బి సి ఆధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, అబుద్ బిన్ హందన్,జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు జవిద్ అక్రమ్,పిసిసి మెంబర్ ఈసా,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతమ్,నగర మైనారిటీ ఆద్యక్షులు ఏజాజ్,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి,మలైకా బేగం,పద్మ, అయుబ్,అబ్దుల్ రషీద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love