అందరి సహకారంతో ఆదర్శవంతంగా అభివృద్ధి

 ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ గాజులరామారం డివిజన్‌లో ప్రగతి యాత్ర
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రాజకీయాలకతీతంగా అందరి సహకారంతో ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. శుక్రవారం గాజులరామారం డివిజన్‌ పరిధిలోని చంద్రగిరి నగర్‌లో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా 63వ రోజు పర్యటించారు. పూర్తిచేసిన సీసీ రోడ్లు, చేపడుతున్న హిందూ స్మశానవాటిక అభివృద్ధి పనుల ను పరిశీలించారు. కాగా తమ బస్తీ అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించినందుకు ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనం తరం మిగిలిన భూగర్భ డ్రయినేజీ, సీసీ రోడ్లు, అందు బాటులో ఉన్న స్థలంలో కమిటీ హాల్‌ ఏర్పాటు, స్మశాన వాటికలో ప్రహరి గోడ నిర్మాణానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న అధికారులకు ఆదేశించారు. త్వరలోనే వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం విష్ణు, ఏఈ కళ్యాణ్‌, సీనియర్‌ నాయకులు రషీద్‌ బేగ్‌, కస్తూరి బాలరాజ్‌, ప్యాక్స్‌ డైరెక్టర్‌ పరుష శ్రీనివాస్‌ యాదవ్‌, నవాబ్‌, చందు ముదిరాజ్‌, ఇబ్రహీం, మూసా కాన్‌, సింగారం మల్లేష్‌, తెలంగాణ సాయి, దిలీప్‌, చిన్నా చౌదరి, శివ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్‌ : పైరవీలు దళారుల మోసాలకు తావు లేకుండా అర్హులైన వారి ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ తెలిపారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధికి చెందిన 781 మంది కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్‌ పథకం లబ్దిదా రులకు రూ.7,81,90,596/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే శుక్రవారం షాపు నగర్‌ లోని ఎంజే గార్డెన్‌ లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.కార్యక్రమంలో నిజాంపేట్‌ మేయర్‌ కొలన్‌ నీలా గోపాల్‌ రెడ్డి, కొంపల్లి మున్సిపాల్టీ చైర్మెన్‌ సన్న శ్రీశైలం యాదవ్‌ , ఎమ్మార్వోలు, డిప్యూటీ ఎమ్మార్వోలు, నిజాంపేట్‌ కార్పొరేటర్లు, మాజీ ప్రజా పతినిధులు, నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్య క్షుడు, బీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ డివిజన్‌ అధ్యక్షులు, సీని యర్‌ నాయకులు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

Spread the love