సొసైటీలో అవకతవకలపై డీసివోకు ఫిర్యాదు చేసిన రైతు కమిటీ సభ్యులు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి

మండలంలోని కోనా సముందర్ సింగిల్ విండోలో  జరిగిన అవకతవకలపై స్థానిక  రైతు కమిటీ సభ్యులు గురువారం  జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు. సొసైటీ చైర్మన్ సామ బాపురెడ్డి,  కార్యదర్శి రాజేశ్వర్ లను బాధ్యులను చేస్తూ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయి విచారణ చేసి  వాడుకున్న నిధులను రికవరీ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. రైతు కమిటీ సభ్యుల ఫిర్యాదు పై స్పందించిన డిసిఓ శ్రీనివాస్ సింగిల్ విండో లో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. నిందితులు ఎవరైనా  వదిలిపెట్టది లేదని స్పష్టంగా డిసిఓ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో సామ ప్రతాప్ రెడ్డి, దూర్శనం జనార్ధన్, చెలిమెల గంగాధర్, చెంగల అశోక్, బలేరావు శంకర్, గ్రామ రైతులు సామ భూమారెడ్డి, జైడి శ్రీనివాస్, బద్దం గంగారెడ్డి, బలేరావు గంగారెడ్డి, పేరం సుధాకర్, సుర సంజీవ్, బలేరావు ప్రశాంత్, బద్దం బాపురెడ్డి, కొండా నరేష్, తదితరులు ఉన్నారు.
Spread the love