తాళం వేసిన ఇంట్లో భారీ దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తికి రిమాండ్

నవతెలంగాణ – మద్నూర్
 మద్నూర్ గ్రామంలో గల మహాజన్ బాలాజీ అనే వ్యక్తి యొక్క ఇంట్లో తేదీ 26/3/2024 నాడు సాయంత్రం అందజా 8 గంటలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, అతడు బయటకు వెళ్లిన సమయంలో ఇంటి తాళం పగులగొట్టి బీరువా తెరిచి, బీరువా లో నుండి అందజా 15 తులాల బంగారు ఆభరణములు,10 తులాల బంగారు బిస్కెట్ అలాగే 16000 ల నగదు ఎత్తుకెళ్లారని మద్నూర్ పోలీస్ స్టేషన్ కి పిర్యాదు రాగ కేసు నమోదు చెయ్యడం జరిగింది. తేది 27/3/2024 రోజున సాయంత్రం సమయం లో పెట్రోలింగ్ చేయుచుండగా మద్నూర్ గ్రామానికి చెందిన ఉప్పరివార్ శ్రీను,32 సంవత్సరాలు అను అతడు అనుమానస్పద్ధంగా చేతిలో సంచి పట్టుకొని పరుగేత్తగా అతన్ని పట్టుకొని విచారించగ అతడు కొన్ని రోజుల నుండి మద్యం తాగుడుకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ దొరికిన వాటిని అమ్ముకుంటు ఖర్చు చేస్తూ ఉండేవాడు. ఆలా ఏదైనా దొంగతనం చెయ్యాలనే ఉదేశ్యంతో గత వారం రోజుల నుండి మహాజన్ ఇంటి వద్ద రెక్కి చేస్తూ, అతడు బయటకు వెళ్లిన సమయం లో ఇంటితాళం పగులగొట్టి బీరువాలో నుండి బంగారు ఆభరణములు దొంగతనం చెయ్యడం జరిగింది. అంతే కాకుండా మూడు నెలల క్రితం బాగన్న మఠం మద్నూర్ కు సంబంధించిన షేటర్స్ లో రేకులు నుండి లోపలకు దిగి గల్లా పెట్టేలో నుండి దొంగతనం చెయ్యడం జరిగింది.అతడు దొంగలించిన బంగారం బిస్కెట్ 10 తులాలు, 15 తులాల బంగారు ఆభరణాలు, 16000 రూపాయలు నగదును పోలీసులు స్వాదిన పరుచుకోవడం జరిగింది. దీని విలువ అందజా మొత్తం 13,31,000/- వరకు ఉంటుంది.నిందితుడిని గురువారం రిమాండ్ కి పంపించడం జరిగింది భారీ దొంగతనానికి పాల్పడ్డ దొంగను డీఎస్పీ ఎదుట ప్రవేశపెట్టి విలేకరులకు తెలియజేయడం జరిగింది ఈ సమావేశం బాన్సువాడ డీఎస్పీ ఎదుట ప్రవేశపెట్టారు.
Spread the love