దూపల్లి సొసైటీ అందరి సహకారంతో లాభాల బాటలో నడుస్తుంది..

– సొసైటీ చైర్మన్ శేషు గారి భూమారెడ్డి…

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం దూపల్లి సొసైటీ పాలకవర్గ సభ్యులు, రైతుల సహాయ సహకారాలతో లాభాల బాటలో ముందుకు సాగుతుందని సొసైటీ చైర్మన్ శేషు గారి భూమారెడ్డి స్పష్టం చేశారు. గురువారం సంఘ సొసైటీ ఆవరణలో పిఎసిఎస్ అధ్యక్షులు ఎస్ భూమా రెడ్డి గారి అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ అందించనున్నందున, రైతుల వద్ద అప్పులను బలవంతంగా వసూలు చేయరాదని సిబ్బందిని ఆదేశించారు. మార్చ్ మొదటి వారంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టి సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలని ఆయన సూచించారు. దూపల్లి సొసైటీ పరిధిలో ప్రస్తుత 88 లక్షల రూపాయల లాభాలలో ఉందని, 11 లక్షల రూపాయల తో నూతన భవన నిర్మాణానికి భూ స్థలాన్ని కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. అందరి సహాయ సహకారాలతోని తమ సొసైటీ లాభాల బాటలో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు గత ఆరు నెలల జమా ఖర్చుల గురించి సీఈవో జీవన్ రెడ్డి సంఘ సభ్యులకు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ శనిగరం సాయి రెడ్డి, కార్యవర్గ సభ్యులు పల్లె సాయిలు, ధనుర్ గంగాధర్, కూనపల్లి రాజిరెడ్డి,  ప్రతాపరెడ్డి, గైని గోపాల్ గంగారం, నీరాడి రవికుమార్ రామ్ రెడ్డి, సాయమ్మ ,శ్రీమతి ముళ్ళపూడి వరలక్ష్మి, కార్యదర్శి జీవన్ రెడ్డి, సెల్ స్మెల్ ఎల్ సాయన్న, ప్రతాపరెడ్డి, వై అటెండర్ వై లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love