నవతెలంగాణ – కర్ణాటక: మహిళా ఎస్‌ఐ సెలవు పెట్టి ఊరికి వెళ్లగా, ఆమె ఉంటున్న అద్దె ఇంటికి ఎవరో దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటన హాసన్ జిల్లా అరకలగూడు తాలూకా కోణనూరులో జరిగింది. కోణనూరు స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న శోభా భరెమక్కనవర్ సెలవుపై ఊరికెళ్లారు. బుధవారం రాత్రి దుండగులు ఆమె ఇంటి తలుపులను బద్ధలు కొట్టి నిప్పుపెట్టారు. రూ.80 వేలు విలువగల లాప్‌టాప్, రూ.25 వేలు విలువైన డ్రెస్సింగ్ టేబుల్, రూ.60 వేలు విలువగల మంచం, రూ 50 వేలు విలువగల బట్టలు కాలిపోయాయి. శోభా సెలవు ముగించుకొని శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా మొత్తం దగ్ధమై కనిపించాయి. డిఎస్‌పీ మురళీధర్, సీఐ రఘుపతి పరిశీలించారు. జాగిలాలతో ఆధారాల కోసం దర్యాప్తు చేపట్టారు.