మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇచ్చిన

– హామీ అమలు కాకపోతే మళ్లీ సమ్మెకి సిద్ధం
– 45 రోజుల విఓఏ సమ్మెకి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
– సమ్మె విరమణ సభలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్‌.
నవతెలంగాణ-కొత్తగూడెం
గత 45 రోజులుగా జరిగిన నిరవధిక సమ్మె సందర్భంగా గ్రామెనాభివృద్ధి సంస్థ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వేతనాలు పెంపు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, ఆర్ధికేతర డిమాండ్ల పరిష్కారానికి సెర్ప్‌ సీఈఓ, ఓఎస్‌డిలతో ఉమ్మడి సమావేశం పెట్టి పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నమని, ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో లో మళ్లీ సమ్మె లోకి పోవాల్సి వస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్‌ అన్నారు. కొత్తగూడెం లో సమ్మె శిబిరంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశం లో ఎ.జె.రమేష్‌ మాట్లాడుతూ ఐకేపీ విఓఏల న్యాయమైన సమస్యలని, గొంతెమ్మ కోర్కెలు కావని,ప్రభుత్వం విఓఏల పనిని గుర్తించడంలో అలసత్వం ఉన్నదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.15 లక్షల స్వయం సహాయక సంఘాలు కి నాయకత్వం వహిస్తూ, రూ.25 వేల కోట్ల రూపాయలు టర్న్‌ ఓవర్‌ ప్రభుత్వానికి అందించడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పధకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం లో వీరి పాత్ర మరువలేమన్నారు. ఇంతటి ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్న వి ఓఏ ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని, ఇప్పటికైనా వీరి సేవలను గుర్తించి సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. 45 రోజుల పాటు జరిగిన సమ్మె లో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన వివిధ రాజకీయ పార్టీలకు,స్వయం సహాయక సంఘాలకు, ప్రజా సంఘాల కు,సామాజిక సంఘాలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఐకేపీ, విఓఏల యూనియన్‌ జిల్లా సీనియర్‌ నాయకులు రేష్మా అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి వీరన్న కె.సత్య, ఐకేపీ, విఓఏల ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి అరుణ, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి శ్రీను గోపాల్‌, నాయకులు మాధవి, మైమున్నీసా, అరుణ, జున్ను సత్యనారాయణ, రమేష్‌, ఉమ, చంద్రకళ, స్వరూప, నాగేశ్వర్‌ రావు, వెంకట లక్ష్మీ, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ మేరకు సమ్మె విరమణ
భద్రాచలం రూరల్‌ : ఐకెపి వీవోఎల సమ్మె డిమాండ్లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సానుకూలంగా స్పందించిన హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు సిఐటియు మండల కో కన్వీనర్‌ మర్లపాటి రేణుక అన్నారు. భద్రాచలం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐకెపి వివోఎలా సమ్మె శిబిరంలో రేణుక మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులుగా జరుగుతున్న వివోఎలా సమ్మె చేస్తూ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టి తమ సమస్య పరిష్కరించాలని ఈ నెల 29న ఇందిరాపార్క్‌ హైదరాబాదులో ధర్నా నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్లో ఆ యూనియన్‌ ప్రతినిధుల బృందంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చర్చలు జరిపి సానుకూలంగా స్పందించారు. త్వరలో సమ్మె డిమాండ్లను పరిష్కరిస్తామని తెలియజేశారని మంత్రి హామీ మీద తాత్కాలికంగా సమ్మె విరమణ చేస్తున్నట్లు ఐకెపి వివో ఏల సంఘం మరియు సిఐటియు తెలియజేయడం జరిగిందని ఆమె అన్నారు. 45 రోజులుగా భద్రాచలం పట్టణంలో సమ్మె చేస్తున్న ఐకెపి వివోఏలకు సహాయ సహకారాలు అందించి అండగా నిలిచిన వివిధ రంగాలకు సంఘాలకు, ఎస్‌హెచ్‌జి గ్రూపులకు సభ్యులకు, మీడియా మిత్రులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు .ఎన్‌. నాగరాజు, జి. లక్ష్మణ్‌, పి.సంతోష్‌, అజరు కుమార్‌, భద్రాద్రి కార్‌ స్టాండ్‌ యూనియన్‌ అధ్యక్షులు రమణ, గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి, ఫ్రూట్స్‌ యూనియన్‌ నాయకులు రాము. కెవిపిఎస్‌ నాయకులు కోరాడ శ్రీనివాస్‌, కార్పెంటర్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రాము, ఎస్‌ డబ్ల్యూ ఎఫ్‌ నాయకులు దుర్గా చారి, ఐకెపి వివోఎలా పట్టణ కోశాధికారి సీతారత్నం, రోజా కుమారి, సల్మా యశోద, శ్యామల అనురాధ అరుణ కృష్ణవేణి, విద్యా కుమారి సుజాత తదితరులు పాల్గొన్నారు.

Spread the love