ఎన్ని సంవత్సరాలుగా సాగుతున్న పనులు

నవతెలంగాణ – మోర్తాడ్

మండల కేంద్రంలో ఎక్సైజ్ నూతన భవనం గత ఎన్ని సంవత్సరాల క్రితం భూమి పూజ నిర్వహించిన నీటికి పనులు పూర్తి దశకు చేరుకోలేదు. ప్రభుత్వ కార్యాలయం అద్దె భవనంలో ఉండగా దానిని తొలగించాలని గృహ యజమాని కోరడంతో స్థానికంగా మహిళ భవనం కాళీ ఉండటంతో అక్కడికి మార్చడం జరిగింది కానీ నూతన భవనం పూర్తిస్థాయిలో నిర్మించాలని అధికారులు ప్రతిపాదన నిర్వహించి మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమీపంలో అధికారులు ఎక్సైజ్ కార్యాలయానికి నిధులు మంజూరు చేశారు. 8 సంవత్సరాలుగా భవనం నిర్మాణ దశ కొనసాగుతూనే ఉంది. రెండు సంవత్సరాలకు ఒకసారి కొంచెం పనులు నిర్వహిస్తూ పనులు ఆపివేయడంతో భవనం పూర్తి దశకు చేరుకోలేక పోతుంది పిల్లల దశలో కొంచెం ఆగిపోగా కొన్ని రోజులు అనంతరం స్లాబ్ నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టర్ రెండు సంవత్సరాలకు గోడలు నిర్మించారు. మరో రెండు సంవత్సరాలకు కిటికీలు ప్లాస్టరింగ్ నిర్వహించిన కాంట్రాక్టర్ తలుపులు ఏర్పాటు చేయకపోవడంతో భవనం అసంపూర్తి దశలోని ఆగిపోయింది. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెస్తున్న ఎక్సైజ్ శాఖకి పూర్తిస్థాయి భవనం లేకపోవడం ఆశ్చర్యానికి కలిగిస్తుంది. అసంపూర్తి దశలో ఆగిపోయిన భవన నిర్మాణాన్ని కాంట్రాక్టర్ అధికారులు తక్షణమే పూర్తిస్థాయిలో నిర్మించి ఎక్సైజ్ శాఖకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Spread the love