ప్రగతిశీల యువజనసంఘం రాష్ట రెండవ మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

నవతెలంగాణ- గాంధారి
గాంధారిమండలంలోని దుర్గంగ్రామంలో ప్రగతిశీల యువజన సంఘం రాష్టం రెండవమహాసభ వాల్ పోస్టర్ ను దుర్గం లో నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా పి వై ల్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర రెండవ మహాసభ జూన్ 5,6తేదీల్లో ఖమ్మం లో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏటారెండు కోట్ల ఉద్యోగాలుఇస్తామని,రాష్ట్రంలో అధికారం లో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చాయని ఈ హామీలను అమలు చేయకపోవడంతో నిరుద్యోగయువతలో నిరాశనిస్పృహలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు యువతను తప్పుదారి పట్టించేందుకు ఉద్రేకాలురెచ్చగొట్టేచర్యలు,మతఉన్మాద చర్యలతో తప్పుదావ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు ఉన్నత చదువులుచదివి ఉద్యోగాలురాకఉపాధి లేక నిరాశకు గురైన యువకులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగాలు ఇస్తామని లేదా నిరుద్యోగ భృతికల్పిస్తామని హామీ లు ఇచ్చిన ప్రభుత్వాల మోసపూరిత చర్యలకారణంగానే యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని ఇందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు దేశంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనేభర్తీ చేయాలనిఆయన డిమాండ్ చేశారు.*నిరుద్యోగ యువతకు కేసిఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు నెలకు3116 రూపాయల నిరుద్యోగభృతిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధి కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొ రేటికరణ,ప్రైవేటీకరణ,మతఉన్మాదాలకువ్యతిరేకంగాపోరాడేoదుకుయువకుల ను సరైన దారిలో నడిపించేందుకు పివైఎల్ మహాసభలలో చర్చించి తగిన కార్యాచరణరూపొందించబోతున్నామని ఆయనతెలిపారుఈసభకుపివైఎల్ రాష్ట్రఅధ్యక్షులు పి.వరదయ్య అద్యక్షత వహిస్తారనిసభలకుప్రొఫెసర్ హరగోపాల్ ,ప్రముఖసినీడైరెక్టర్,నటుడు ఆర్.నారాయణమూర్తి,సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి కేంద్రకమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వరరావు,రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులుగోవర్ధన్,పిఓడబ్ల్యూజాతీయకన్వీనర్వి.సంధ్య,AIKMS రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య,IFTU రాష్ట్ర కార్యదర్శి M.శ్రీనివాస్,PYL రాష్ట్రకార్యదర్శిరాజేందర్,మోకాళ్లరమేష్,తుడుంవీరభద్రo,కుమారి తదితరులు ప్రసంగిస్తారని ఆయన తెలిపారు.* మహాసభలను జిల్లాలోని యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పి వై ఎల్ నాయకులు సాంబాజీ, శ్రవణ్,, శ్రీకాంత్, పిడియస్ యు జిల్లా అధ్యక్షులు సతీష్ ఉపాధ్యక్షులు మోజీ రామ్ పండరి, తదితరులు పాల్గొన్నారు

Spread the love