ప్రభుత్వరంగ సంస్థలను అమ్మే కుట్రలను తిప్పికొడదాం..

కార్మికులకు కర్తవ్యాలను బోధించడం కోసమే మహాసభలు : సీఐటీయూ జాతీయ
కోశాధికారి ఎం.సాయిబాబు
 సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 16వ మహాసభలు
నవతెలంగాణ-గోదావరిఖని:
కార్మికులకు కర్తవ్యాలను బోధించడం కోసమే సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 16వ మహాసభలు ఆదివారం నిర్వహించారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు టి.రాజారెడ్డి అధ్యక్షత నిర్వహించన మహాసభలకు ఎం.సాయిబాబా హాజరై హాజరై మాట్లాడారు. నేడు దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కారు చౌకగా అమ్మేస్తూ నష్టాల పేరుతో ఉన్నటువంటి సంస్థలను మూసి వేస్తూ లాభాలు వచ్చే సంస్థలను ప్రయివేటీకరిస్తున్నారని తెలిపారు. అంతేకాదు, నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌ పేరుతో బొగ్గు పరిశ్రమల్లో కూడా ప్రభుత్వ రంగ వాటాలను అమ్ముకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలో 11వ వేతన ఒప్పందం రెండేండ్లు లేటుగా జరిగిందన్నారు. దీనికి కారణం ప్రభుత్వం ప్రతేడాదిలా అగ్రిమెంట్‌ చేయాలని డీపీఈ గైడ్లైన్స్‌ ఫాలో కావాలని ఈ కోణంలో చర్చలు జరగడంలో ఆలస్యం జరిగిందని తెలిపారు. ఈ విధానాలను మొదటి నుంచి సీఐటీయూ వ్యతిరేకిస్తూ ఐదు జాతీయ సంఘాలను కలుపుకొని ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో జరిగిందన్నారు. గౌరవ అధ్యక్షులు పి రాజారావు మాట్లాడుతూ.. దేశంలో అనేక పోరాటాల ఫలితంగా 1973లో జాతీయకరణ చట్టం ద్వారా ప్రయివేటు పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగ సంస్థలుగా మారాయన్నారు. 1974 నుంచి ఒకటవ వేతనం ఒప్పందం ప్రారంభమైనప్పుడు 11వ వేతన ఒప్పందం పూర్తి స్థాయిలో చేసుకున్నామని, కానీ అదే ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో 2017లో పెరగాల్సి నటువంటి వేతన ఒప్పందం నేటికీ జరగలేదన్నారు. అనేక పరిశ్రమల్లో వేతన ఒప్పందాల ఊసే లేదని, అందుకే ఈ వేతన ఒప్పందం దేశంలోని బొగ్గు గని కార్మికుల విజయం అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమయిన బొగ్గు పరిశ్రమలను కాపాడుకోవటం కోసం ఐక్య ఉద్యమాలను ఏర్పాటు చేసి కార్మికులను చైతన్యపరిచి పోరాట ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా తీర్మానాలు చేస్తారన్నారు. అందుకు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, కార్మిక కుటుంబాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ నాగరాజు గోపాల్‌, వై.యాకయ్య, సీఐటీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.కుమారస్వామి, ఏ.ముత్యం రావు, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం.సారయ్య, ఎం.శ్రీనివాస్‌, మూడు డివిజన్ల నాయకులు ఉల్లి మొగిలి, డి కొమురయ్య, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love