ఎందరో ప్రాణత్యాగాల ఫలితమే మేడే

నవతెలంగాణ – మల్హర్ రావు
మే1 అంటే మేడే దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా కూడా పిలుస్తారు.అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని ,లాయల్టీ, డేగా వ్యవహరిస్తున్నారు.చాలా దేశాల్లో మేడేని సెలవు దినంగా పాటిస్తారు.ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం.1886లో షికాగోలోని  హే మార్కెట్ లో జరిగిన కార్మికుల ప్రదర్శనయె ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు.కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నివసిస్తూ 1886లో మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరువాత షికాగోలోని హే మార్కెట్ లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు.ఆ సంఘటన ఆనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు,నిరసన,ప్రదర్శనలు చోటుచేసులున్నాయి.1890 మే1న బ్రిటన్ లోని హైడ్ పార్క్ లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3లక్షల మంది కార్మికులు హాజరయ్యారు రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పని వేళలు ఉండాలన్నదే అప్రదర్సనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్ గా మారింది. ఆపైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే విధానంతో ప్రదర్శనలు జరిగాయి.క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే1న కార్మిక దినోత్సవంగా జరుపుకోవలన్నా ఒప్పందం కూడా కుదిరింది.ఆపై ప్రపంచ వ్యాప్తంగా మేడే స్వరూపం మూడుతూ వచ్చింది.అనేక దేశాల్లో ఆరోజు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు, నిరసనలు,ప్రదర్శనలు  మాత్రం ఆగలేదు.ఎనిమిది గంటలు పని,ఎనిమిది గంటలు విశ్రాంతి,ఎనిమిది గంటలు వినోదం అనే బ్యానర్ పట్టులోని 1858లోఆస్ట్రేలియా లో ఎనిమిది గంటల పని దినోత్సవ మూడో వార్షికోత్సవాన్ని కార్మికులు జరుపుకున్నారు.
Spread the love