కార్యాలయాల ముస్తాబు

– కొల్లాపూర్‌కు 6న సీఎం రాక
– విద్యుత్‌ కాంతులతో ముస్తాబైన కలెక్టర్‌,ఎస్పీ సమీకృత కార్యాలయాలు
– భారీ హౌల్డింగులతో ముస్తాబవుతున్న ప్రధాన రహదారులు
– అన్ని రంగులతో సింగారించుకున్న కొల్లాపూర్‌ చౌరస్తా
– లక్షన్నర మంది లక్ష్యంగా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
– ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి ప్రత్యేక దృష్టితో భారీ ఏర్పాట్లు
జూన్‌ 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కొల్లాపూర్‌ చౌరస్తాలోని నూతన జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమీకృత భవన సముదాయం, జిల్లా పోలీసు సమీకృత భవన సముదాయాలను ప్రారంభించనున్నారు. అదేవిధంగా జిల్లా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తదనంతరం మార్కెట్‌ యార్డు కు సమీపంలో వెలమ సంఘం ఫంక్షన్‌ హాల్‌ పక్కన భారీ బహిరంగ సభకు సీఎం హజరౌతున్నాట్టు ఎమ్మెల్యే చేప్పారు.
కొల్లాపూర్‌ సభకు భారీగా తరలిరావాలి
నాగర్‌ కర్నూల్‌ నియోజ కవర్గానికి అభివృద్ధి ఫలాలను అందించిన మన ముఖ్య మంత్రి చంద్రశేఖర రావు కి కృతజ్ఞత తెలుప డానికి భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గ ప్రజలను కోరారు. నా భూతో భవిష్యత్తు అన్న విధంగా లక్ష మందితో భారీగా స్వాగతం పలికేందుకు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నాగర్‌ కర్నూల్‌ ప్రజలు ఆశించని అభివృద్ధిని అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలపడానికి స్వచ్ఛందంగా రావాలి.
మర్రి జనార్దన్‌ రెడ్డి, ఎమ్మెల్యే నాగర్‌కర్నూల్‌ జిల్లా
నవతెలంగాణ- కందనూలు
నాగర్‌ కర్నూల్‌ చరిత్రలో నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.జూన్‌ 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కొల్లాపూర్‌ చౌరస్తాలోని నూతన జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమీకృత భవన సముదాయం, జిల్లా పోలీసు సమీకృత భవన సముదాయాలను ప్రారంభించనున్నారు.అదేవిధంగా జిల్లా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తదనంతరం మార్కెట్‌ యార్డు కు సమీపంలో వెలమ సంఘం ఫంక్షన్‌ హాల్‌ పక్కన భారీ బహిరంగ సభకు మైదానాన్ని చదును చేశారు. భారీ యంత్రాలతో ఐదు రోజులుగా ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. 1,50,000 మందిని తరలిం చాలన్న లక్ష్యంతో సభా ప్రాంగణాన్ని తీర్చిదిదు ్దతున్నారు. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌, నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశాలు ఉండడంతో వాహనాలకు పార్కింగ్‌ ఇతర వస తులను ఘనంగా కల్పిస్తున్నారు. వేదిక వద్ద ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. భార్య హౌల్డింగ్‌ లతొ కొల్లాపూర్‌ రహదారి తో పాటు అచ్చంపేట రహదారి నాగర్‌ కర్నూల్‌ పట్టణానికి వెళ్లే రహదారులకు ఇరువైపులా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఫోటోలతో కూడిన భారీ హౌల్డింగ్‌ లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు నాగర్‌ కర్నూల్‌ నియోజక వర్గ అభివృద్ధిని తెలిపే విధంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లతో కూడిన హౌల్డింగ్‌ లను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గాని కి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెడికల్‌ కళాశాలతో పాటు జిల్లా ప్రజల సౌలభ్యం కోసం పరిపాలన సౌలభ్యం కోసం సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవనం, పోలీసు సమీకృత కార్యాలయ భవనాన్ని, ట్యాంక్‌ బండ్‌ తో పాటు అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల వంటి భారీ అభివృద్ధి పథకాలను అందించినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారిని కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపడానికి ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. నాగర్‌ కర్నూల్‌ కు మరిన్ని వరాల జల్లులు అందిస్తారనే ఆశతో ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకే ఇచ్చిన అభివృద్ధిని చూసిన ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభకు తరలివచ్చి కృతజ్ఞతా భావాన్ని చాటుకోవాలని ఆశతో ఉన్నారు. విద్యుత్‌ కాంతులతో అలంకరించిన కలెక్టర్‌ కార్యాలయం అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఎస్పీ కార్యాలయాన్ని రూపుదిద్యారు.

Spread the love