విండీస్‌ క్రికెటర్‌ డెవాన్‌ థామస్‌పై

ఐసీసీ సస్సెన్షన్‌ వేటు
న్యూఢిల్లీ : శ్రీలంక ప్రీమియిర్‌ లీగ్‌ 2021లో ఫిక్సింగ్‌ పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో వెస్టిండీస్‌ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ డెవాన్‌ థామస్‌పై ఐసీసీ సస్సెన్షన్‌ వేటు వేసింది. థామస్‌పై సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని.. శ్రీలంక క్రికెట్‌, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డ్‌, కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ యొక్క అవినీతి నిరోధక కోడ్‌ల ప్రకారం అతనిపై ఏడు అభియోగాలు మోపినట్టు వెల్లడించింది. వీటిపై విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని తెలిపింది. డెవాన్‌ థామస్‌ గతేడాదే టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. అతను విండీస్‌ తరఫున ఒక టెస్ట్‌, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్‌లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్‌లు చేశాడు. టెస్టుల్లో, వన్డేల్లో బౌలింగ్‌ సైతం చేసిన థామస్‌.. ఫార్మాట్‌కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు.

Spread the love