– తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావతోటే ప్రజల కలలు సహకారం
– 60 ఏండ్లకు పైగా వివక్షకు గురైతే తొమ్మిదేండ్లలో అభివృద్ధి వైపు పయనం
– దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు
– భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల కలలు సహకారం అవుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. 60 ఏండ్లుగా ఈ ప్రాంతం వివక్ష గురైందని ఆవేదన వ్యక్తపరచారు. తొమ్మిదేండ్లలో రాష్ట్ర అభివద్ధి వైపు పయనిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. రైతు బంధు, రైతు బీమా , దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు రోడ్లు, నీటిపారుదల మౌలిక సదుపాయాల కల్పనలో యాదాద్రి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు. అధికారులు ,ప్రజల అండదండలతోటే సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల కనులలో ఆనందం వ్యక్తం అవుతుందన్నారు కెసిఆర్ నిర్దేశాల మేరకు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు ప్రయాణించేటట్టు చేసి అగ్ర భాగాన నిలబెడుతున్నామన్నారు.
నియోజకవర్గంలో నీటిపారుదల గురించి వివరించండి ?
నసింహ సాగర్ కింద భువనగిరి నియోజకవర్గంలో 312 చెరువులు నింపడంతో పాటు 23 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుంది. హై లెవెల్ మెయిన్ కెనాల్ ద్వారా నీటి పారుదల జరుగుతుందన్నారు. సొంత నిధులతో మూసి తర్వాత ప్రాంతంలో గుర్రపు డెక్క ఆకులను తొలగించాం.
మౌలిక సదుపాయాలు?
నియోజకవర్గంలో 271.21 కిలోమీటర్లు నూతన రోడ్లు వేశామన్నారు. 8762.60 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. భువనగిరి పట్టణం తో పాటు పోచంపల్లి పట్టణం రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయన్నారు. వలిగొండ పట్టణంలో రోడ్డు వెడల్పుకు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు టెండర్ కూడా పూర్తయింది.
జిల్లా కేంద్రమైన భువనగిరి అభివృద్ధి?
మున్సిపాలిటీలో రాష్ట్రంలోనే అభివృద్ధి కలిగిన మున్సిపాలిటీగా ముందుకు పోతుందన్నారు. అభివృద్ధిని రాష్ట్ర అసెంబ్లీలోనే కేటీఆర్ ప్రస్తావించిన విషయం అందరికి తెలిసిందే . రూ. 20 కోట్లతో జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పు జరిగింది. రూ. 91 లక్షలతో పార్కుల అభివృద్ధి. జిల్లా కేంద్రం ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం, ఫిజియోథెరపీ, నవజాత శిశువుల కేంద్రం ఏర్పాటయ్యింది. ప్రభుత్వ ఆసుపత్రిలో గతం కంటే ఎక్కువగా కాన్పులు జరుగుతున్నాయి. బస్తి దవఖాన్లు ఏర్పాటు చేశాం. ఎన్నో ఏళ్లుగా ఉన్న అర్బన్ కాలనీ సుమారు రెండు కోట్లతో భూనిర్వాసితులకు రోడ్డు వేయడానికి మంజూరైంది. భువనగిరి పెద్ద చెరువు కట్ట సుందరీకరణ జరిగింది. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో మురుగు కాలువలు రోడ్లు కల్వర్ట నిర్మాణం జరుగుతుంది. మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి పురాతనమైన మెట్ల బావిని సుందరీకరణ చేయడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పనులు త్వరలోనే పూర్తవుతాయి.
బీబీనగర్ మండలంలో అభివృద్ధి గురించి చెప్పండి?
బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీ కోసం అధిక నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు బీబీనగర్ చెరువును పటిష్టం చేయడం సుందరీకరణ చేయడం జరుగుతుందన్నారు ఎయిమ్స్ లో వైద్యం అందే విధంగా కృషి చేస్తున్నాం. ప్ర పోచంపల్లి అభివృద్ధి పోచంపల్లి రోడ్డు వెడల్పు తో పాటు మూసీ కాలువ ద్వారా మీరు చివరి భూముల వరకు అందేటట్లు చేశాం. పోచంపల్లి చెరువును త్వరలోనే సుందరీకరణ చేస్తాం. చేనేత పరిశ్రమ కోసం అత్యాధునిక సాంకేతిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తాం. నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాలకు రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించాం. పరిశ్రమల కాలుష్యం ద్వారా చెరువులు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాం.