చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో కార్ల్‌సన్‌

Pragnananda's second game was also a draw-ప్రజ్ఞానంద రెండో గేమ్‌ సైతం డ్రా
– ఉత్కంఠ టైబ్రేకర్‌కు!
బాకు : ఫిడే చెస్‌ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద అద్భుతంగా పావులు కదులుపుతున్నాడు. సెమీఫైనల్లో 31 ఏళ్ల అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ ఫాబియానో కరౌనాతో పోటాపోటీగా ఆడుతున్నాడు. వరల్డ్‌ నెం.3 ఫాబియానోను సెమీస్‌ తొలి గేమ్‌లో నల్లపావులతో 78 ఎత్తుల్లో నిలువరించిన ప్రజ్ఞానంద.. ఆదివారం రెండో గేమ్‌లోనూ అతడికి అవకాశం ఇవ్వలేదు. తెల్లపావులతో ఆడిన చెన్నై చిన్నోడు గేమ్‌లో వెనుకంజలో నిలిచినా.. 47 ఎత్తుల్లో మ్యాచ్‌ను డ్రా చేశాడు. దీంతో చెరో అర పాయింట్‌ పంచుకోవాల్సి వచ్చింది. ప్రజ్ఞానంద, కరౌనా చెరో పాయింట్‌తో ఉండడంతో..విజేతను టైబ్రేకర్‌తో తేల్చనున్నారు. మరోవైపు వరల్డ్‌ నం.1 మాగస్‌ కార్ల్‌సన్‌ ఫైనల్‌కు చేరాడు.

Spread the love