– కె జితేందర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలోని తెలంగాణ సీడ్స్ గోడౌన్లో ఖరీఫ్ సీజన్ కు సరిపడా పచ్చి రొట్ట సాగుకు అవసరమైన జీలుగా విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి కే జితేందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం జితేందర్ రెడ్డి మాట్లాడుతూ 30 కేజీల జిలుగు బస్తా పూర్తి ధర 2408/- రూపాయలు కాగా 65 శాతం సబ్సిడీ ఫోన్ 1565/- మిగతా 843/- రూపాయలు రైతులు చెల్లించి జీలుగా బస్తాను పొందవచ్చు అన్నారు. రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలను అధికారులకు అందించి ఎనిమిది వందల నలభై మూడు రూపాయలు చెల్లించి బస్తాలు తీసుకు వెళ్ళవచ్చు అన్నారు. వరి సాగు చేసే రైతులు తొలకరి ప్రారంభంలో పొలంలో పచ్చిరొట్ట సాగు చేసి నట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చని అన్నారు.