నల్లధనం దాచుకునేవారికి రెడ్‌ కార్పెట్‌

రూ.2వేల నోట్ల ఉపసంహరణపై చిదంబరం
న్యూఢిల్లీ : నల్ల ధనం మార్చుకునే బడా కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ పరిచిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం అన్నారు. 2016 నాటి పెద్ద నోట్ల రద్దు అనంతరం మోడీ ప్రభుత్వం నల్ల ధనాన్ని వెలికి తీసేందుకు మరోసారి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటోందని ఎద్దేవా చేశారు. సాధారణ ప్రజల వద్ద రూ.2,000 నోట్లు లేవని, రోజువారీ చిల్లర నగదు మార్పిడికి అవి పనికిరావని, 2016లో వాటిని ప్రవేశపెట్టినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. నల్ల ధనాన్ని కాపాడుకునేవారికి ఇవి సహాయపడ్డాయని, ఇప్పుడు వారు తమ నోట్లను మార్చుకునేందుకు రెడ్‌ కార్పెట్‌పై మోడీ ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని ట్వీట్‌ చేశారు. 2016లో రూ.2,000 నోటును ప్రవేశపెట్టడం ఓ మూర్ఖపు చర్య అయితే ఏడేళ్ల అనంతరం ఆ మూర్ఖపు చర్యను వెనక్కి తీసుకున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.

Spread the love