తగ్గిన బంధన్‌ బ్యాంక్‌ లాభాలు

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23 మార్చి తో ముగిసిన నాలుగో త్రైమా సికం (క్యూ4)లో బంధన బ్యాంక్‌ నికర లాభాలు 57.51 శాతం తగ్గి రూ.808 కోట్లుగా నమోదయ్యింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,902 కోట్ల నికర లాభాలు సాధించింది. క్రితం క్యూ4లో బ్యాంక్‌ నికర వడ్డీపై ఆదాయం 18.8 శాతం పెరిగి రూ.2,472 కోట్లుగా చోటు చేసుకుంది. క్యూ3లో రూ.2,080 కోట్ల ఎన్‌ఐఐ నమోదయ్యింది. 2022-23గాను ప్రతీ రూ.10 ఈక్విటీ షేర్‌పై రూ.1.50 డివిడెండ్‌ను ప్రకటించింది.

Spread the love