ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్‌ సెక్రటరీ విజయ్కుమార్‌ ఉద్యోగ విరమణ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్‌ సెక్రటరీ విజయ్కుమార్‌ ఉద్యోగ విరమణ చేశారు. బుధవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో విజరుకుమార్‌ను ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బంది, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేషి సిబ్బంది, తెలంగాణ సచివాలయం ఉద్యోగ సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానం చేశారు. విజరుకుమార్‌ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ అయ్యేందుకు చేసిన సేవలు ఎప్పటికి మర్చి పోలేమని సిబ్బంది చెప్పారు.పదవి విరమణ చేసినప్పటికి సూచనలు, సలహాలు తీసుకుంటామని చెప్పారు. తాను పదవి విరమణ పొందినప్పటికి ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ కార్యక్రమాల్లో తనవంతు భాగస్వామిగా ఉంటానని ఈ సందర్భంగా విజయ్కుమార్‌ చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ అభివద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, అదనపు కార్యదర్శి ఉమాదేవీ, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కార్యాలయ ఉద్యోగులు పి.ఎస్‌.రాజేశ్వర్‌, ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love