సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు

సోమరాజుల మనోహర్‌ మృతి
– రేపు రేగళ్లలో అంతక్రియలకు ఏర్పాట్లు
– భారీగా తరలి రానున్న అభిమానులు…ప్రజలు
నవతెలంగాణ-కొత్తగూడెం
రేగళ్ల దొరగారు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, ఇండియన్‌ గ్యాస్‌ అధినేత సోమరాజుల మనోహర్‌ బాబు (56) శనివారం అర్ధ రాత్రి హైద్రాబాద్‌లోని ప్రయివేటు అసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రేగళ్ల దొరగారుగా పిలువబడే మనోహర్‌బాబు కొత్తగూడెంలో సుదీర్ఘ కాలంగా ఆయన కాంగ్రెస్‌ నాయ కులుగా పనిచేశారు. 2006-11లో కొత్తగూ డెం మండల ప్రజాపరిషత్‌ ఉపాద్యాక్షులుగా, 2012లో మండల కాంగ్రెస్‌ అద్యక్షులుగా, 2016 తెరాస లక్ష్మీదేవిపల్లి మండల అద్యక్షులుగా, కొత్తగూడెం సోసైటీ మాజీ డైరెక్టర్‌గా నిరుపమానమైన సేవలందించారు. గత రెండు దశాబ్దాల క్రితం కొత్తగూడెంలోని ఇండియన్‌ గ్యాస్‌ ఏజన్సీని ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతి ప్రజానికానికి ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారు. ఆయన గత కొంత కాలంగా కిడ్ని వ్యాధితో బాధపడుతున్నారు. కిడ్నిల సమస్య తలెత్తడంలో మెరుగైన వైద్యం కోసం లక్ష్మీదేవిపల్లి మండలంలోని, రేగళ్ల గ్రామంలోని తన సొంత ఇంటి నుండి హైద్రాబాద్‌కు మకాం మార్చారు.అక్కడే చికిత్స పొందుతున్నారు. మాజీ ప్రధాని పివి.నర్సింహారావు అల్లుడికి స్వయాన సోదరుడైన మనోహర్‌బాబు వ్యక్తిత్వం, సేవదృక్పదం మరువలేనిది. కుటుంబ సభ్యులు విదేశాల నుండి వచ్చిన తరువాత స్వగ్రామం రేగళ్లలో ఈ నెల 31వ తేదీన అంతక్రియలు నిర్వహించనున్నట్లు మిత్రులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

Spread the love