ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారితో సహా ఆరుగురు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు ఘటనాస్థంలోనే చనిపోయారు. గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love