నవ్వుల్‌ పువ్వుల్‌

రియాల్టీ తిట్లు
పైలెట్‌ భార్య:
నా దగ్గర మరీ అంతలా ఎగరకండి.
డాక్టర్‌ భార్య: ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకూ తెలుసు
టీచర్‌ భార్య: నాకేం క్లాసులు పీకక్కర్లేదు..
జడ్జిభార్య: ఇది చెప్పడానికి వాయిదాలెందుకు. నేను చెప్పేదే ఫైనల్‌.
న్యాయవాది భార్య: ఆధారాలు నాచేతికి వచ్చాక మీకుంటాది..
యాక్టర్‌ భార్య: ఈ మాత్రం యాక్షన్‌ మాకూ వచ్చూ
ఇంజనీర్‌ భార్య: ప్లాన్లు వేయడం మాకూ తెలుసు
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి భార్య: మీ ఆఫీస్‌లో ఉన్న యాంటీవైరస్‌కి ఏ సాఫ్ట్‌వేర్‌ వాడాలో నాకు బాగా తెలుసు..
పొలిటీషియన్‌ భార్య: మీ అధిక ప్రసంగం ఆపకపోతే, మా అమ్మ నాన్నలతో అత్యవసర సమావేశం పెట్టి మీ భర్త పదవికి ఉద్వాసన పలుకుతా.
వ్యాపారి భార్య: మీ పత్తేపారం బయట చూపించండి. నాకాడ కాదు.
జర్నలిస్టు భార్య: మీ కవరేజీలు మీ ఛానల్‌లో చూపించుకోండి. ఎక్స్‌ట్రాలు చేస్తే ఇంట్లో మీ లైవ్‌ కవరేజ్‌ని నేను వీధిలో చూపించాల్సి ఉంటాది.

అర్థంకాని రాత
ఒక అమ్మాయి మెడికల్‌ షాపు బయట నుంచిని ఉంది.
తనకు కావాల్సింది వెళ్లి అడుగుదామంటే, షాప్‌లో చాలా మంది జనం నుంచుని ఉన్నారు.
చాలా సేపు వెయిట్‌ చేసిన తర్వాత జనం కాస్తా తగ్గారు.
అప్పుడు చాలా మొహమాట పడుతూ షాప్‌ అతని దగ్గరికి వెళ్లింది.
”సార్‌, మీరు ఏమి అనుకోకుండా నాకు ఒక హెల్ప్‌ చేయాలి. ఇందాకటి నుండి ఎలా అడగాలో అర్ధం కావడం లేదు….
నాకు కాబోయే భర్త ఒక డాక్టర్‌ అండీ.. తను నాకు లవ్‌లెటర్‌ రాశాడు. ఎంత చదివినా అర్ధం కావడం లేదు. కాస్తా చదివి పెడతారా?

Spread the love