దక్షిణ..ప్రదక్షిణ..!

దక్షిణ.. ప్రదక్షిణ… ఈ రెండు పదాలకు ఇప్పుడున్నంత గిరాకీ ఎప్పుడూ లేదు. మొదటిది పార్టీలో టిక్కెట్‌ దక్కాలంటే ఇచ్చేది. రెండోది ఇచ్చినా రాకపోతే దాన్ని దక్కించుకోవటం కోసం చేసేది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఆఫీసుల వద్ద ఇవే సీన్లు కొనసాగుతున్నాయి. ఒక పార్టీలో టిక్కెట్‌ రాలేదంటూ ఇంకో పార్టీలోకి, అక్కడా దక్కకపోతే మరో పార్టీలోకి జెట్‌ స్పీడుతో దూకుతున్నారు ఆశావహులు. ఈ క్రమంలో నిన్నటిదాకా తిట్టిన పార్టీ ఈ రోజు మంచిదవుతోంది.. గతంలో మంచిదే అన్న పార్టీ ఇప్పుడు చెడ్డవుతోంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో అసలు ఇలా పూటకో పార్టీ మారే నాయకాగ్రేసరులకు పార్టీల మీద విశ్వాసం, వాటి సిద్ధాంతాల పట్ల నమ్మకం, గౌరవం ఏమాత్రం లేదని తేలిపోతోంది. అలా ఉంటే ఏండ్ల తరబడిఉన్న పార్టీలను ఎడం కాలితో తన్ని… రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించటం ఎలా సాధ్యం..? మనిషన్న వాడికి, అందునా మనసున్న వాడికి ఇవన్నీ సాధ్యపడవు కదా..? అనే డౌటనుమానం సగటు ఓటరుకు తలెత్తుతోంది.
– కే.నరహరి

Spread the love