తర్జుమా తరంగిణి

తర్జుమా తరంగిణిబాగ్దాద్‌ నగరాన్ని ఎలా పోల్చుకుంటారు?

బాగ్దాద్‌ నగరాన్ని ఎలా పోల్చుకుంటారు ఎవరైనా?
అక్కడి ఎత్తైన గంభీరమైన తమాల వక్షాల ద్వారా.
దర్జీ పారేసే పేలికలలాగా నా శరీరం, ఆత్మ
చిరిగిపోయి అటూయిటూ పడిపోయాయి
ఆ చింపిరి గుడ్డల్ని తొడుక్కుని తిరుగుతాన్నేను,
పర్యటించే ఫకీర్ల మధ్య కలిసిపోయి.
అత్యున్నతుడవైన ఓ నా ఆధ్యాత్మిక బోధకుడా, అని పాడుతూ
యాచిస్తాను బాగ్దాద్‌లోని ఇరుకు వీధుల్లో
పంజాబీ మూలం: సుల్తాన్‌ బహు
ఆంగ్లానువాదం: తసీర్‌ గుజ్రాల్‌, సకూన్‌ సింగ్‌
తెలుగు సేత: ఎలనాగ

Spread the love