నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని సీపీఐ(ఎం) తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చినందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు డీజేహెచ్‌ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీజేహెచ్‌ఎస్ విన్నపం మేరకు సీపీఐ(ఎం) తన ఎన్నికల మ్యానిఫెస్టోలో జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని పొందుపరిచిందని తెలిపారు.