ఉపాధిహామీ చట్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి

– సమ్మర్‌ బోనస్‌ నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం
– ఉపాది పని ప్రదేశాల సందర్శనలో
ప్రజా సంఘాల నాయకులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పోరాడి సాదించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. సోమవారం ప్రజా సంఘాల ఆద్వర్యంలో లచ్చిగూడెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సందర్శించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వ్యవశాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు , జిల్లా అద్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అద్యక్షులు యలమంచి వంశీకృష్ణ, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు కారం పుల్లయ్య మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు లేక కూలీలు ఎర్రటి ఎండలో పనులు చేపడుతున్నట్లు వారు తెలిపారు. పనులు చేసిన కూలీలకు డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. ఉపాదిహామీ చట్టాన్ని వ్యవశాయరంగానికి అనుసందానం చేసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఉపాధి పని ప్రదేశాన్ని సందర్శించిన వారిలో వ్యవశాయకార్మిక సంఘం మండల కార్యదర్శి మర్మం చంద్రయ్య, లచ్చిగూడెం జిపి మాజీ సర్పంచ్‌ సోంది అర్జున్‌, రైతు సంఘం నాయకులు పెనుబల్లి ప్రసాద్‌, అర్జున్‌, శ్రీరామ్‌, శ్రీరాములు, రామక్క, సరోజిని, రమేష్‌, కృష్ణమూర్తి, మల్లేష్‌, తదిరులు పాల్గొన్నారు.

Spread the love