తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్‌లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కటం విశేషం. మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు కోటికి ఈ అరుదైన గౌరవం లభించింది. అత్యద్భుతమైన సంగీతంతో ప్రేక్షకుల గుండెల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాలూరి రాజేశ్వరరావు అబ్బాయిగా, మన అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సంగీత దర్శకుడు కోటిగా తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవను గుర్తించి జీవిత సాఫల్య పురస్కారాన్ని జూలియా ఫిన్, మెంబర్ అఫ్ న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ అందించింది. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ, ‘ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ఇక్కడి ప్రవాస భారతీయులకు, ఐక్యరాజ్యసమితి సభ్యులకు కృతజ్ఞతలు. ఇదొక గొప్ప గౌరవం. నాకు అన్నీ ఇచ్చిన భారతదేశానికి ఈ అరుదైన గౌరవాన్ని అంకితం ఇస్తున్నాను’ అని చెప్పారు.