వైభవంగా ఆది దంపతుల కళ్యాణం..

– అంగరంగ వైభవంగా శివ కళ్యాణం..
– పరవశించిన అశేష భక్తజనం..
– భక్తులతో కిక్కరిసిన రాజన్న క్షేత్రం..
– ఆలయ ప్రాంగణంలో మారుమోగిన శివనామ స్మరణ..
– స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ ఈవో, మున్సిపల్ కమిషనర్..
నవతెలంగాణ – వేములవాడ
ఆది దంపతులు శ్రీ రాజరాజేశ్వరి- రాజరాజేశ్వరస్వామి  వారుల దివ్య కళ్యాణం..  అంగరంగా వైభవంగా కన్నుల పండుగ దేవాలయ అధికారులు నిర్వహించారు.. కళ్యాణ వేదికను రంగురంగుల పుష్పాలతో షోభాయమానంగా అలంకరించారు.. వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి, వధువు పార్వతి దేవి అమ్మవారిని మంగళ వాయిద్యాలతో అర్చకుల మంత్రచారాల మధ్య చైర్మన్ చాంబర్ ముందు ఏర్పాటుచేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్ద వరకు ఎదుర్కొన్నారు.. వరుడు తరుపున ఆలయ ఈవో వధువు తరుపున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా, వరకట్నంగా 551 కోట్లు చెల్లిస్తామన్నారు.   ఆలయ ప్రధాన అర్చకులు అప్పల బీమా శంకర్ శర్మ – ఇందిర దంపతులు కన్యదాతలుగా వ్యవహరించారు. ముందుగా దేవాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు, ఆలయ స్థాన చార్యులు అధ్వర్యంలో అభిజిత్ లగ్న  మూహుర్తమున ఉదయం 10 ‌‌.55 నిమిషాల నుండి 12.05 నిమిషాల వరకు  వేద మంత్రోచ్చారల  తో శ్రీ స్వామి వారి కళ్యాణం  ఘనంగా జరిపించారు. మరో వైపు శ్రీ స్వామి వారి కళ్యాణం జరుగుతుండగా శివ పార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకోని శివుడిని పెళ్లాడినట్లు భావిస్తూ శివ నామాన్ని జపిస్తూ స్మరించుకున్నారు.
        శ్రీ రాజరాజేశ్వరి- రాజరాజేశ్వర స్వామి వారుల దివ్య కళ్యాణ మహోత్సవం కు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరుపున ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అధికారులు మున్సిపల్ కార్యాలయం నుండి మేళా తాళల మధ్య ఆలయంకు చేరుకుని స్వామి వారుల కళ్యాణంకు పట్టు వస్ర్తాలు సమర్పించారు.   శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారుల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి వేలాది గా భక్తులు శివపార్వుతులు తరలివచ్చారు.   రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన  కళ్యాణాన్ని భక్తులు  అసక్తిగా తిలకించారు.  ప్రధానంగా కళ్యాణం జరిగేటప్పుడు శివ పార్వతులు చేతి లో త్రిశూలను కదలిస్తూ, ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ పరిసర ప్రాంతాలలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘ ఏర్పాటు చేసి పట్టణ ఇన్చార్జి సీఐ శ్రీనివాస్  పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు,పట్టణ ప్రముఖులు భక్తులు తదితరులు పాల్గొన్నారు..
Spread the love