త్రిబుల్ ఇంజన్ సర్కారులో భాగాస్వాములవ్వాలి..

– ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి విజ్ఞప్తి 
– బీజేపీ,బీఆర్ఎస్ అబద్దాల కోరులంటూ ఆరోపణ 
– మాటిస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ హామీ
– మండలాన్ని సిద్దిపేటలో కలిపింది వినోదేనని అసహనం..
– ఎమ్మెల్యే హరీశ్ రావువి అన్ని అబద్దాలేనని అగ్రహం
– ఇథనాల్ పరిశ్రమ పాపం బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం
నవతెలంగాణ-బెజ్జంకి
అవినీతితో పరిపాలన సాగించిన డబుల్ ఇంజన్ సర్కారులకు తగిన బుద్ది చెప్పేల త్రిబుల్ ఇంజన్ కాంగ్రెస్ సర్కారులో ప్రజలు భాగస్వాములవ్వాలని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు,మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.శుక్రవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్,మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బస్టాండ్ వరకు వెలిచాల రాజేందర్ రావు రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడారు. ప్రపంచంలో భారత దేశాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా  నిలుపుతామంటూ బీజేపీ..పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతుకవుతామని బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దాలు చెబుతూ మరోసారి ప్రజలు మోసం చేస్తున్నారని ప్రజలు అలోచన చేయాలని సూచించారు.మాటిస్తే..మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని ఎన్నికల అనంతరం ఆరు గ్యారెంటీలు, ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. పూర్వపు కరీంనగర్ జిల్లాను బీఆర్ఎస్ నేతలు తమకూలంగా ఏడు ముక్కలుగా విడదీసీ బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపింది బోయినిపల్లి వినోద్ కుమారేనని అసహనం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే హరీశ్ రావువన్ని అబద్దాల కోరూ మాటలనని మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజారీ చేస్తామని హామీ ఇచ్చి నిధులివ్వకుండా శఠగోపం పెట్టారని అగ్రహం వ్యక్తం చేశారు.మండలంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాలకు అనుకూలంగా వ్యవహరించింది బీఆర్ఎస్ ప్రభుత్వపాపమేనని స్పష్టం చేశారు.మండలాన్ని యథావిథిగా కరీంనగర్ జిల్లాలో కలుతామని.. రాష్ట్రంలోని మంత్రులు,నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు తోడుగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించి త్రిబుల్ ఇంజన్ సర్కారులో ప్రజా సమస్యల పరిష్కారం,అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీగా వల్ల రాజేందర్ రావును గెలింపించాలని ప్రజలను అభ్యర్థించారు.
బీజేపీకి అధికారమిస్తే రాజ్యాంగ మార్పు తథ్యం..
సర్వమతాలకు నిలయమైన భారత దేశంలో మతోన్మాద చిచ్చుపెడుతూ రాముడితో ప్రజల మద్య వైరాష్యాలు సృష్టించి అధికారం చేపట్టాలని బీజేపీ యత్నిస్తోందని..మళ్లీ బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చడం తథ్యమని కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు.దేశానికి బీజేపీ,కరీంనగర్ బండి సంజయ్ చేసిందేమిలేదని..స్థానికేతరుడు బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రజలకు చేసిందేమిలేదని అవినీతి,అబద్దాలతో ప్రజలను మోసం చేసే బీజేపీ,బీఆర్ఎస్ అభ్యర్థులకు తగిన గుణపాఠం చెప్పేల కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని రాజేందర్ రావు ప్రజలను అభ్యర్థించారు.నాయకులు రత్నాకర్ రెడ్డి,ఒగ్గు దామోదర్,పులి క్రిష్ణ,మహిళాధ్యక్షురాలు కనగండ్ల జ్యోతి,అయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు, మహిళలు హజరయ్యారు.
Spread the love