కార్మికులకు రూ.26వేల కనీస వేతనమివ్వాలి

– వలస కార్మిక చట్టాన్ని అమలు చేయాలి :
– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, మల్లికార్జున్‌
– గుమ్మడిదల, ఐడీఏబొల్లారం మండలాల్లో జీపుజాత
నవతెలంగాణ-గుమ్మడిదల, ఐడీఏబొల్లారం
పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, కనీస వేతనాన్ని వెంటనే సవరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, మల్లికార్జున్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త జీపుజాత శనివారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలో, జిన్నారం, ఐడీఏబొల్లారం మండ లాల్లోని ఖాజీపల్లి, గడ్డపోతారం ప్రాంతాల్లో పర్యటిం చింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని ధనలక్ష్మి స్టీల్‌ పరిశ్రమ, గ్రాండ్‌ న్యూల్స్‌, హెటిరో యూనిట్‌ -1, ఎంఎస్‌ఎన్‌, ఖాజీపల్లి, గడ్డపోతారం ప్రాంతాల్లోని అరబిందో, హెటిరో డ్రగ్స్‌, లీ ఫార్మా, ఎస్‌ఎంఎస్‌ పరిశ్రమల దగ్గర నిర్వహించిన సభల్లో భూపాల్‌, మల్లికార్జున్‌ కార్మికులనుద్దేశించి మాట్లాడారు.
కార్మికులకు కనీస వేతనం అమలు చేయక పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 2014 నుంచి కనీస వేతనాన్ని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు విఫలం అయ్యాయని విమర్శించారు. పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, సెలవులు, ఓటి డబుల్‌, యూనిఫామ్‌, బూట్లు క్యాంటీన్‌, ప్రమాదం తర్వాత ఆదుకోవడం తదితర సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా రన్నారు. ధనలక్ష్మి స్టీల్‌ పరిశ్రమలో బీహార్‌, ఇతర రాష్ట్రాల కార్మికులకు సరియైన సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా 12 గంటలు పనులు చేయిస్తున్నారని చెప్పారు. వలస వచ్చిన కార్మికులను రేకుల షెడ్డులో ఉంచుతున్నారని.. వారికి అనువైన ప్రదేశాల్లో ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. వలస కార్మికుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
ఈ సందర్భంగా పలువురు వలస కార్మికుల గదులను పరిశీలించారు. విద్యుత్‌, నీటి సౌకర్యం, వాష్‌ రూమ్‌లో ఎటువంటి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధరల భారంతో కార్మికులు అతలాకుతలమవుతున్నా.. ప్రభుత్వాలు కనీస వేత నాన్ని అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే సీనియార్టీ ప్రకారం అర్హులైన కార్మికులకు వేతనాలు పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ఈనెల 17న జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్య క్షులు కె.రాజయ్య, నాయకులు చంద్రశేఖర్‌, వెంక టేష్‌ గౌడ్‌, ప్రభాకర్‌ రావు, వీరభద్రం, సుధాకర్‌గౌడ్‌, జాయింట్‌ సెక్రెటరీ నరసింహ గౌడ్‌, ఆర్గనైజర్‌ సెక్రెటరీ దేవేందర్‌, ట్రెజరర్‌ రవి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ హుస్సేన్‌, వీరేష్‌, గోపాల్‌ రెడ్డి, కార్మికులు రవీందర్‌రెడ్డి దుర్గారావు, దశరథరావు, హమాలీ యూనియన్‌ నాయకులు సాయిలు, కృష్ణ, యాదగిరి, రాములు, రాజు, సత్యం, నరేష్‌ పాల్గొన్నారు.

Spread the love