బాన్సువాడ పారిశ్రామిక రంగ అభివృద్ధికి కృషి

– డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ పురపాలక సంఘ పరిధిలోని ఆటోనగర్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ మున్సిపాలిటీ అభివృద్ధి లో బాగంగా 6 కోట్ల 80 లక్షల రూపాయలతో ఆటో నగర్ లో మౌలిక సదుపాయాల కల్పన తదితర పనులను స్థానిక ఆర్డీఓ రాజ గౌడ్ , ,మున్సిపల్ చైర్మన్ శ్రీ గంగాధర్ గారు, జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  త్వరతగితిన పనులను పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. పురపాలికలో నిధులు లేక పోయినప్పటికి ఉన్న నిధులతో ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఆటోనగర్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కోసం ప్రణాళికలను సిద్దం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామన్నారు. తక్షణ మౌళిక సదుపాయల కల్పనలో భాగంగా ఉన్న నిధులతో ఈ పనులను చేపట్టినట్లు వివరించారు. అనంతరం తిర్మలాపూర్ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. కొత్తబాద్ గ్రామంలో 30 లక్షల రూపాయలు తో నూతనంగా నిర్నించనున్న 40 వేల లీటర్ల వాటర్ ట్యాంకు మరియు అంతర్గత పైపు లైన్ పనులకు , రూ 25 లక్షల రూపాయల తో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ కు భూమి పూజ చేశారు, రూ 10 లక్షలతో నిర్మించనున్న డ్వాక్రా సంఘం భవనానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ మోహన్ నాయక్ ,ఎంపీపీ శ్రీమతి నీరజ వెంకట్ రాం రెడ్డి , జెడ్పీటీసీ శ్రీమతి పద్మ గోపాల్ రెడ్డి , తిర్మలపుర్ ఎంపీటీసీ శ్రీమతి సునీత మల్లారెడ్డి, తిర్మలపుర్ సర్పంచ్ శ్రీ జిన్న రఘురామయ్య ,కొత్త బాద్ సర్పంచ్ శ్రీమతి అంకిత సాయగౌడ్ తదితరులు హాజరయ్యారు.

Spread the love