ప్రేక్షకుల్ని మెప్పించే సరికొత్త కాన్సెప్ట్‌

A brand new concept to please the audienceనాని మూవీ వర్క్స్‌, రామా క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం రమాకాంత్‌ రెడ్డి వహించారు. డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29న రాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్ర ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో సుమన్‌, నిర్మాత ఏ.ఎం.రత్నం ముఖ్య అతిథులుగా విచ్చేసి, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
నిర్మాత డా.కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి మాట్లాడుతూ,’నేను విద్యావేత్తగా ఇంజనీరింగ్‌ కాలేజీలను నిర్వహిస్తున్నాను. పిల్లల్లో ఉన్న ప్యాషన్‌కు ఓ ఫ్లాట్‌ ఫాం కల్పించాలనే ఉద్దేశంతోనే నాని మూవీ వర్క్స్‌ను స్థాపించాను. నేను ఉన్న, పెరిగిన ఊరుని తెరపై చూపించాలనే కోరిక ఉండేది. రమాకాంత్‌ రెడ్డి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. మా టీజర్‌, ట్రైలర్‌ అందరికీ బాగా నచ్చాయి. సినిమా కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘మా చిత్రం ఇంత త్వరగా పూర్తయి, రిలీజ్‌కు రెడీ అవ్వడానికి ఓబుల్‌ రెడ్డి కారణం. కథ, పాత్రలు, సంగీతం, ఫొటోగ్రఫీ.. ఇలా అన్ని బాగా వచ్చాయి’ అని మరో నిర్మాత మహేశ్వర్‌ రెడ్డి చెప్పారు. మరొక నిర్మాత కాటం రమేష్‌ మాట్లాడుతూ,’ దర్శకుడు రమాకాంత్‌, నాని సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్‌ చక్కగా నటించారు’ అని తెలిపారు.
డైరెక్టర్‌ రమాకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘కలియుగం పట్టణంలో అజరు మంచి సంగీతాన్ని ఇచ్చారు. దేవీ ప్రసాద్‌ వంటి సీనియర్లను డైరెక్ట్‌ చేయడం, ఆస్కార్‌ విన్నర్‌ చంద్రబోస్‌ వంటి వారితో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
ఇదొక యూనిక్‌ థ్రిల్లర్‌ మూవీ. మదర్‌ సెంటిమెంట్‌, థ్రిల్లర్‌ను కలిపి చేసిన ఓ డిఫరెంట్‌ సినిమా. ప్రతీ ఒక్క పాత్ర, ఎమోషన్‌కు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. మా దర్శక, నిర్మాతల సహకారం వల్లే సినిమా బాగా వచ్చింది.
– హీరో విశ్వ కార్తికేయ

Spread the love