చాక్లెట్స్‌ గురించి కొన్ని విషయాలు…

మీకు చాక్లెట్స్‌ అంటే ఇష్టమేనా? అయితే మీకు హ్యాపీ చాక్లెట్‌ డే. పన్నెండేండ్ల క్రితం ఈ చాక్లెట్ల పండగ మొదలైంది. ప్రతి ఏడాది జులై 7న ఇంటర్నేషనల్‌ చాక్లెట్‌ డేగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే చాక్లెట్‌ గురించి మీకు తెలియని విషయాలు ఇవిగో..
చాక్లెట్లు 16వ శతాబ్దం నుంచే ఉనికిలో ఉన్నాయి.

 మొట్టమొదటిసారి ఐరోపాలో చాక్లెట్లను 1550లో ఒక డిజర్ట్‌ గా తయారు చేశారు.
చాక్లెట్స్‌ తింటే.. ఒత్తిడి ఆందోళన తగ్గిపోతుందని పలు పరిశోధనల్లో తేలింది.

 భావోద్వేగాలకు గుర్తుగా చాక్లెట్లను ఇచ్చిపుచ్చుకుంటారు.
70 శాతం కొకోవా ఉండే చాక్లెట్లు ఒత్తిడి మీద మంచి ప్రభావం చూపిస్తాయి.

 రెండు వారాల పాటు ప్రతిరోజూ 1.4 ఔన్సుల డార్క్‌ చాక్లెట్‌ తీసుకుంటే.. మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే కార్టిసోల్‌, క్యాటెకోలమైన్స్‌ అనే హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి.

 చాక్లెట్‌ తినడం వల్ల రక్తపోటును తగ్గించడం, జీవక్రియ వేగాన్ని పెంచడం, కడుపులో గట్‌ బ్యాక్టీరియాను వద్ధి చేయడం వంటి ప్రయోజనాలున్నాయి.
డార్క్‌ చాక్లెట్లు యాంటీవైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు కలిగి ఉంటాయి. అందుకే.. వైద్యులు ఒత్తిడి ఫీలవుతున్నప్పుడు డార్క్‌ చాక్లెట్‌ తినమని సలహా ఇస్తారు.

 డార్క్‌ చాక్లెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీర కణాలను ఫ్రీ రాడికల్స్‌ నుంచి కాపాడుతాయి.

Spread the love