చైనా మాంజా వాడితే చర్యలు

న‌వ‌తెలంగాణ – కాసిపేట: చైనా మాంజా వాడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజర్‌ ప్రవీణ్‌ నాయక్‌ హెచ్చరించారు. బుధవారం కాసిపేట మండలంలోని కొండాపూర్‌ యాపలో ఫారెస్ట్‌ రేంజర్‌ సుభాశ్‌ ఆదేశాలతో పతంగులు అమ్మకపు షాపుల్లో పారెస్ట్‌ అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ సంధర్భంగా డిప్యూటీ రేంజర్‌ ప్రవీణ్‌ నాయక్‌ మాట్లాడుతూ చైనా మాంజ వలన పక్షులకు, మనుషులకు ప్రాణహాని జరిగే అవకాశం ఉందని, చైనా మాంజా మెడకు కోసుకొని మంచిర్యాలలో చనిపోయిన సంఘటనలున్నాయని అవగాహాన కల్పించారు. గాలిపటాల విక్రయదారులు సాధారణ దారం అమ్మాలని, నిషేదిత చైనా మాంజాని అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలో ఎఫ్బీవోలు కుమార స్వామి, సురేశ్‌ పాల్గొన్నారు.

Spread the love