వ్యవసాయం కనుమరుగు..!

111జీవో ఎత్తివేతతో వేల ఎకరాలు నిర్మాణ రంగంలోకి..
పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలు
ప్రస్తుతం 111జీవో పరిధిలోని భూములు 70 శాతం వ్యాపారుల చేత్లులోనే..
జీవో ఎత్తివేతతో వ్యాపారులకు, భూస్వాములకే లబ్ది
సామాన్యులకు ఉపాధి కరువు నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న రియల్‌ వ్యాపా రులకు 111 జోవో ఎత్తివేత ఊపిరి పోసినట్లైయింది. కానీ ఈ ప్రాంత సామాన్య ప్రజలకు మాత్రం ఊపిరి అగిపోయినట్టు అవుతోంది. ఇన్నాళ్లు పచ్చటి పొలాలతో కళకళలాడిన భూములు.. కనురగయ్యే ప్రమాదం ఉంది. ‘స్వచ్ఛమైన వాతవరణంలో బతుకుతున్న మా బతుకుల్లోకి అభివృద్ధి పేరుతో ప్రకృతి వినాశాన భూతాన్ని ప్రభుత్వం మాపై విసురుతుందని’ ప్రజలు ఆందోళన చెందు తున్నారు. ప్రభుత్వం నిర్ణయం సామాన్య ప్రజల కోసం కాదని.. రియల్‌ వ్యాపారులు, బడా పారిశ్రామిక వేత్తల కోసం అనేది స్వష్టమవుతుందని స్థానికులు వాపోతున్నారు. 111 జీవో ఎత్తివేత కాదు… ఈ ప్రాంత ప్రకృతిని కాపాడేం దుకు ప్రభుత్వం పకడ్బందీగా నియామ నిబంధనలు రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు.
హైదరాబాద్‌ నగర జంట జలాశయాలుగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఉస్మాన్‌సాగర్‌, హిమయత్‌ సాగర్‌ పరిధిలోని భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేం దుకు అవకాశం లేకుండా గత ప్రభుత్వాలు 111 జీవో తీసుకువచ్చింది. అయితే ఇటీవల ప్రభుత్వం ఈ జీవోను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. జీవో ఎత్తివేతతో ప్రస్తుతం వ్యవసాయం భూములగా ఉన్న భూము అన్ని నిర్మాణ రంగంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఉప సమనం తప్ప సామాన్యులకు, రైతులకు ఉపయోగం లేదని వాపోతున్నారు.
చేవెళ్ల, రాజేందర్‌నగర్‌ నియోజకవర్గంలోని 84 గ్రామాల్లో లక్ష 36 వేల ఎకరాలకు జీవో నెంబర్‌ 111 అంక్షాలు ఉండటంతో ఈ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టే అవకాశాలు లేవు. అయినప్పటికీ ఈ ప్రాంతాల్లో భూములు రైతుల చేతుల్లో నుంచి 70 శాతం వ్యాపారుల చేతుల్లోకి మారాయి. నిర్మాణాలు చేపట్టే అవకాశం లేక పోవడంతో ఫామ్‌హౌజ్‌లు నిర్మాణాలు చేసి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ.. హైదరాబాద్‌కు కూరగాయాలు, పండ్లు, పూవ్వులు ఎగుమతి చేసేవారు. ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు నగరానికి చేరేవి. ఈ ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు ఉండేవి. 111 జీవో ఎత్తివేతతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మాయం కానున్న వ్యవసాయం భూములు
జీవో 111 పరిధిలోని ఉన్న 84 గ్రామాల భూములు వ్యాపారులు చేతిలో ఉన్నాయి. ఎన్నో ఏండ్లుగా ఎదురు చేస్తున్న రియల్‌ వ్యాపారులకు 111 జోవో ఎత్తివేత ఉపిరి పోసినట్లైయింది. సామాన్యులకు మాత్రం ఉపిరి అగి పోతుంది. జీవనాదారమైన వ్యవసాయ రంగం కనుమ రుగయ్యే ప్రమాదం ఉంది. బడాబాబుల చేతుల్లో ఉన్న భూములు పరిశ్రమలకు, నిర్మాణ రంగంలోకి వెళ్లే ఈ ప్రాంతంలో పిట్ట వాలే స్థలం లేకుండా పోయే ప్రమాదం లేక పోలేదని.. పచ్చటి చేలతో ఉన్న ఈ భూములు భవిష్యత్‌లో భవన నిర్మాణాలతో దర్శనం ఇవ్వనున్నాయని ఈ ప్రాంతం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

Spread the love