కొలతల ఆధారంగానే డబ్బులు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో బాగంగా మండలం లోని నర్సింగ్ పూర్ గ్రామంలో 13 మంది ఉపాధి హామీ సిబ్బంది తో కలిసి ఒకరోజు కులీ  పనులు చేశారు.ఈ సందర్భంగా ఎపిఓ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి కులిలకు ఏరకంగా పనులు చేస్తే ఎంతో మేరకు డబ్బులు వస్తాయో అవగాహన కల్పించడానికి స్వయాన ఎపిఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులతో కలిసి ఒక రోజు కులి పనులు చేయగా ఎవరెజ్ గా రూ.250 రూపాయలు వచ్చాయన్నారు. కులిలు సైతం ముందస్తుగా కోలతల అదరంగానే పనులను ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు పూర్తి చేసుకుంటే రూ.200వందల పైనే రోజు కులి పడుతుందని వివరించారు.
Spread the love