పోలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచాలి

– 1201 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కొరకు ఏర్పాట్లు.
– పోలింగ్ కేంద్రాలు ఉన్న అన్ని పాఠశాలలను పంచాయతీ సెక్రెటరీలు పర్యవేక్షించాలి..
– జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ యస్ వెంకట్రావు.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పోలీస్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు.శుక్రవారం వెబ్ ఎక్స్  విడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ,జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక, బిఎస్ లతా తో కలిసి నిర్వహించారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.  వికలాంగులు వయోవృద్ధుల కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంపులు, వీల్ చైర్స్ అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలల యొక్క బాధ్యతను పంచాయతీ సెక్రటరీలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజు పోలింగ్ కేంద్రాలను శుభ్రపరచాలని కలెక్టర్ తెలిపారు. 1201 పోలింగ్ కేంద్రాలలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని ఏ చిన్న తప్పైనా సెంట్రల్ ఇష్యూ అవుతుందని కావున జాగ్రత్తగా ఎన్నికల ఏర్పట్లు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ జరిగే రోజున పోలింగ్ తీరును కేంద్రాలను సీఈవో కూడా పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలు అన్ని మౌలిక వసతులు జిల్లా శుభనండా పోలీస్ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో లోన బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు ని ఎంచుకునే విధంగా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఏ అధికారికి మొబైల్ అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు తాసిల్దార్లు ఎంపీడీవోలు ఎంపీలు పంచాయతీ సెక్రటరీలు పోలీసు అధికారులు బిఎస్ఎన్ఎల్ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.
Spread the love