కాల్వలో పల్టీ కొట్టిన ఆటో

– మహిళ మృతి
– మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-వైరా
వైరాలోని ఇందిరమ్మ కాలనీ వద్ద వైరా-మధిర ప్రధాన రహదారిపై అడ్డుగా వచ్చిన గేదెను తప్పించబోయిన ఆటో అదుపుతప్పి వైరా ప్రాజెక్ట్‌ కుడి కాల్వలో పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామానికి చెందిన పాపగంటి నాగేంద్రమ్మ(50) తీవ్రంగా గాయపడింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు కాగా 108 ద్వారా ఖమ్మం తరలించారు. కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామానికి చెందిన పాపగంటి ఏసు పాదం, ఎల్లమ్మ దంపతుల కుమార్తె వివాహం జూన్‌ 5న జరగనుండగా షాపింగ్‌ చేసేందుకు ఏసుపాదం, ఎల్లమ్మ దంపతులు తమ బంధువులతో కలిసి వైరాకు ఆటోలో వస్తుండగా, వైరాలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో రిజర్వాయర్‌ కుడి కాల్వ వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటో గేదెను తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పిన ఆటో కుడి కాల్వలోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పాపగంటి మరియమ్మ, పాపగంటి ఏసు పాదం, గంధం సత్యానందం, పాపగంటి మరియమ్ములకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వైరా బ్లూ కోల్డ్‌ పోలీసులు 108 వాహనంలో ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాపగంటి నాగేంద్రమ్మ(50) మృతి చెందింది. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో సీపీఎం వార్డు సభ్యురాలు నాగేంద్రమ్మ మృతి
నవతెలంగాణ-కొణిజర్ల
వైరా మండలం సోమవారం గ్రామం వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో మండల పరిధిలోని చిన్నమునగాల గ్రామానికి చెందిన సిపియం ఏడవ వార్డు సభ్యురాలు పాపగంటి నాగేంద్రమ్మ మృతి చెందారు. మరణవార్త తెలుసుకుని సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం, బొంతు రాంబాబు మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు గ్రామ శాఖ కార్యదర్శి చింత నింపు నరసింహారావు చెరుకుమల్లి మోహన్‌ రావు, పాపగంటి వెంకటేష్‌, కస్తాల శ్రీను కంపాసాటి శివ, పాపగంటి జనార్ధన్‌, అక్కలు, బెంజి, గోపావరం సొసైటీ చైర్మన్‌ చెర్కుమల్లి రవి, గ్రామ సర్పంచ్‌ కంపల్లి స్వప్న, ఉప సర్పంచ్‌ దమ్మలపాటి వెంకటయ్య ఇలారపు మురళి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Spread the love