ఐక్యతతోనే మెరుగైన ఒప్పందం

– హెచ్‌ఎంఎస్‌ నాయకులు అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు
– మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో లేని విధంగా బొగ్గు గనుల్లో కార్మిక సంఘాల ఐక్యత వల్లే మెరుగైన 11వ వేతన ఒప్పందం సాధించటం జరిగిందని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జెబిసిసిఐ సభ్యులు మంద నరసింహారావు పేర్కొన్నారు. సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంట్రల్‌ వర్క్‌ షాప్‌లో జెండా ఎగురవేసి బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన పిట్‌ మీటింగ్‌లో నరసింహారావు మాట్లాడుతూ బొగ్గు గని కార్మికుల 12వ వేతన సవరణ 5 సంవత్సరాల కాలపరిమితికి 19 శాతం అగ్రిమెంటు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో ఎక్కడా లేని విధంగా అగ్రిమెంట్‌ చేయడంతోపాటు అన్ని అలవెన్సులు 25 శాతం పెంచుకోవడం జరిగిందని తెలిపారు. దీంతోపాటు ఫ్రీజింగ్‌తో అండర్‌ గ్రౌండ్స్‌ 9 శాతం నుంచి 11.25 శాతం స్పెషల్‌ అలవెన్స్‌ 4 శాతం నుండి 5 శాతం, హెచ్‌ఆర్‌ఏ 2 శాతం నుంచి 2.5 శాతం పెరుగుదల వల్ల కార్మికులకు లాభం చేకూరిందని ఆయన తెలియజేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్కరోజు సమ్మె చేయకుండా కార్మికులు నష్టపోకుండా కార్మికులు భావిస్తుంటే అగ్రిమెంట్‌ పై సంతకాలు చేసి తోటి సంఘాలపై దుస్ప్రచారం చేయడం హెచ్‌ఎంఎస్‌ నాయకునికి మతిస్థిమితం లేదని, కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సిగ్గు చేటని విమర్శించారు. అవగాహణ రాహిత్యంతో మాట్లాడుతున్న వారిని కార్మికులు నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, భూక్య రమేష్‌, గడల నరసింహారావు, కొత్తపల్లి రమేష్‌ బాబు, కూరపాటి సమ్మయ్య, నాజర్‌, ఎంఎన్‌. రావు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love