మెరిసిన రిషభ్‌ పంత్-అక్షర్‌.. గుజరాత్‌ లక్ష్యం 225

నవతెలంగాణ – ఢిల్లీ: గుజరాత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు రిషభ్‌ పంత్(88), అక్షర్‌టేల్ పటేల్(66) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. పృథ్వీషా(11), జేక్‌(23), హోప్‌(5), స్టబ్స్‌(26) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ 3, నూర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు

Spread the love