హైద‌రాబాద్‌లో చిరుజ‌ల్లులు..

నవతెలంగాణ-హైద‌రాబాద్ : గ‌త రెండు, మూడు రోజుల నుంచి హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్న సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోదు అవుతుండ‌టంతో న‌గ‌ర ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. కానీ బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో వాతావ‌ర‌ణం పూర్తిగా చ‌ల్ల‌బ‌డింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు కురిశాయి. దీంతో న‌గ‌ర‌వాసుల‌కు ఉక్క‌పోత నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగింది. మొత్తంగా తీవ్ర‌మైన ఎండ‌ల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ట్లైంది. చ‌ల్ల‌ని గాలుల‌ను న‌గ‌ర ప్ర‌జ‌లు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

Spread the love