సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి

– తుమ్మల వెంకటరెడ్డి సిపిఐఎం ములుగు జిల్లా కార్యదర్శి.
నవతెలంగాణ- గోవిందరావుపేట
మంత్రి కేటీఆర్ ములుగు పర్యటన సందర్భంగా సిపిఐ ఎం నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించాలని సిపిఐ ఎం ములుగు జిల్లా కార్యదర్శి తుంబల వెంకటరెడ్డి అన్నారు. బుధవారం మండలం లోని పసర పోలీస్ స్టేషన్ లో వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ ములుగు పర్యటన సందర్భంగా మండలంలోని పసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు సిపిఎం నాయకుల ఇండ్లకు వెళ్లి అక్రమంగా అరెస్టు చేశారని తుమ్మల వెంకట్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి పేర్కొన్నారు. ములుగు జిల్లాకు కేటీఆర్ రాక సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులను అరెస్టు చేయడం అక్రమమని పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని ప్రజా సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించారు. ఈ రోజున గోదావరి నీరు ములుగు జిల్లాకు రావడంలేదని దీనిని వెంటనే ప్రభుత్వం ఆలోచించి జిల్లా రైతులకు నీరు వచ్చేలా కృషి చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ఏకైక ఫ్యాక్టరీ మూసివేసి ఐదు సంవత్సరాలైనా ఎందుకుఫ్యాక్టరీ తిరిగి నడిపి కార్మికుల ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలమైందని పేర్కొన్నారు. ప్రధానంగా ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టినట్టు వేరుస్తుందని పేర్కొన్నారు .వెంటనే జిల్లా సమస్యలు పరిష్కారం కొరకు ప్రభుత్వం పని చేయాలి కానీ ప్రశ్నించే గొంతులను సిపిఎం పార్టీ నాయకులను అరెస్టు చేసి ప్రజా ఉద్యమాలని ఆపలేరని, భవిష్యత్తులో సిపిఎం పార్టీ జిల్లా సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు అరెస్ట్ అయిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు పొదిల్ల చిట్టిబాబు గొంది రాజేష్ లను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.

 

Spread the love