గ్రామపంచాయతి కార్మికుల సమస్యలపై జేఏసీ సమ్మె నోటీసు

– కార్మిక సంఘాల జేఏసీ నేతలు దాసు, జంగం గంగాధర్, కాజా
నవతెలంగాణ – కంటేశ్వర్
గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో 07 జూన్ 2023 తేదీన జిల్లా డిపిఓ కి సమ్మె నోటీసును బుధవారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ & తెలంగాణ ప్రగశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జంగం గంగాధర్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ..రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతిలో పనిచేస్తున్న 50 వేల మంది కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేశారు. దాసు, జంగ గంగాధర్ ,ఎండి ఖాజా మొయినుద్దీన్. మాట్లాడుతూ..స్వచ్ఛ తెలంగాణలో అగ్రగామిగా నిలిచిన సఫాయి కార్మికులకు సెల్యూట్ కొట్టితే సరిపోదని, జీవో నెంబర్ 60 లో పేర్కొన్న విధంగా వెంటనే 19 వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా వెయ్యి రూపాయలు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన సరిపోదని, ధరలు అగ్గిలాగా భగ్గుమంటుంటే, పంచాయతి కార్మికుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నయని, వెంటనే వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని వారు కోరారు. రాష్ట్రంలో పంచాయతి కార్మికులందరికీ వెంటనే పీఎఫ్ , ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మరణించిన కార్మిక కుటుంబానికి 10 లక్షలు, సాధారణ మరణానికి 5 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐదు జూన్ తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కి రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. నిజామాబాద్ డిపిఓ కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి గ్రామపంచాయతీ జేఏసీతో చర్చలు జరిపి జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిచో జూన్ 21 తరువాత సమ్మె అనివార్యమవుతుందని వారు తెలిపారు. జిపి జేఏసీ పిలుపులో భాగంగా జూన్ 12 తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టి నాయకులు జేపీ గంగాధర్, డి పోశెట్టి, సొప్పరి గంగాధర్, ఇందూరు రాజయ్య, రసూల్, శ్రీనివాస్ సిఐటియు నాయకులు మ్యాదరి గంగారాం, మేకల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love