ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పెట్టొద్దు

– హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
నవతెలంగాణ -హైదరాబాద్‌
ఖమ్మంలోని లకారం చెరువు వద్ద ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్టాపనకు బ్రేక్‌ పడింది. ఎన్టీఆర్‌ విగ్రహం శ్రీకృష్ణుని పోలి ఉన్నట్టుగా తయారుచేసి ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లను గురువారం హైకోర్టు అత్యవసరంగా విచారణ జరిపింది. ఈ మేరకు ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్‌ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయ కూడదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావలి ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మంలో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహం రూపొందడంపై శ్రీకృష్ణ జాక్‌, ఆదిబట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘాలు అభ్యం తరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విగ్రహం ఏర్పాటుపై స్టే విధించింది. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో భాగంగా లకారం ట్యాంక్‌ బండ్‌ వద్ద 54 అడుగు ల ఎత్తయిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ఈ విగ్ర హం శ్రీకృష్ణుడి రూపంలో ఉండటం వివా దానికి కారణ మైంది. తమ మనోభావాలు దెబ్బ తినే విధంగా హిందూ మత భావాలను దెబ్బతీసే విధంగా విగ్రహ ఏర్పాటు చేస్తున్నారని పిటిషనర్‌ వాదన. సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే తదుపరి ఉత్తర్వు జారీ చేసే వరకు విగ్రహ ప్రతిష్టాపన చేయొద్దని నిర్వాహకులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.
బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత
టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో ఇద్దరు నిందితులు సాయి లౌకిక్‌, సాయి సుష్మిత దాఖలు చేసిన బెయిల్‌ పిటి షన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు గురువారం జస్టిస్‌ సాంబశివరావు నాయుడు మధ్యంతర ఆదేశాలు జారీ చేశా రు. 42 రోజులుగా జైల్లో ఉన్నారని, దర్యాప్తునకు పిటిషన ర్లు సహకరిస్తారని ఇతర నిందితులకు బెయిల్‌ కూడా వచ్చి ందని వీరికీ బెయిలివ్వాలని వారి న్యాయవాది వాదించారు. సాయి సుష్మిత ప్రశ్న పత్రం లీకేజీ కేసులో కీలకపాత్ర ఉందనీ, ఆమె కూడా పరీక్ష రాశారనీ, ఆమె భర్త లీకేజీ పేపర్లను ఇతరులకు అమ్మారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. వాదనల విన్న తర్వాత న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు చెప్పారు.

Spread the love