రాహుల్ గాంధీని ప్రధాని చేయడం లక్ష్యం: దుద్దిళ్ల శ్రీనుబాబు

– జెఎన్ టియు హెచ్ కళాశాల, హార్టీ కల్చర్ కళాశాల, విజ్ఞాన కేంద్రాలు తీసుకువచ్చిన ఘనత శ్రీధర్ బాబుదే 
నవతెలంగాణ – మల్హర్ రావు
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లుగా రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడారు మొన్న  మంత్రి శ్రీధర్ బాబు చెప్పినట్లుగా ఈ ప్రాంత అభివృద్ధి ట్రైలర్ తోనే ఆగిపోదని కచ్చితంగా 70 ఎంఎంలో సినిమా చూపిస్తామన్నారు.ముందు ముందు అసలు సినిమా చూపిస్తామన్నారు.ఈ ప్రాంత అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.మంథని నియోజకవర్గంలో జెఎన్ టీహెచ్ కళాశాల, విజ్ఞాన కేంద్రం,హార్టీ కల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఘనత శ్రీదర్ బాబుదేన్నారు.దుద్దిళ్ల కుటుంబాన్ని ఆదరించిన మంథని ప్రజానికానికి, ఐదుసార్లు శ్రీధర్ బాబుకి గెలిపించి రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన ప్రజల రుణం కచ్చితంగా తీర్చుకుంటామన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలన కాలంలో అభివృద్ధి  చేయకుండా, అక్రమ సంపాదనకు ఏగాపడ్డారన్నారు .కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మంథని నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీ వచ్చేలా చూడాలన్నారు.కేంద్రంలో రాహుల్ గాంధీ  నాయకత్వంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఈ పార్లమెంటు ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మన కోసం 5 న్యాయ గ్యారంటీలైన రైతులందరికీ కనీస మద్దతు ధర, ఉపాది హామీ కూలీలకు రోజుకు రూ.400 పెంపు, ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా లక్ష రూపాయలు, రూ..25 లక్షల వరకు క్యాష్ లెస్ వైద్య సాయం అందేలా హెల్త్ స్కీం, నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యగాల కల్పన అనే పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తుందన్నారు.పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాని, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో, అధిక ధరలతో, నిరుద్యోగంతో ప్రజలను మోసం చేశాయని విమర్శించారు.
Spread the love