జింబాబ్వే అధ్యక్షుడిగా రెండోసారీ ఎమ్మర్సన్‌ నంగాగ్వా ఎన్నిక

హరారే: ఎమ్మర్సన్‌ నంగాగ్వా వరుసగా రెండోసారి జింబాబ్వే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శనివారం వెల్లడైన ఫలితాల్లో మంగాగ్వా విజయం సాధించారు. అధికార పార్టీ అవకతవకలకు పాల్పడిం దని ఆరోపణలు వెల్లువెత్తినా ప్రజలు రెండోసారి కూడా అధికార పార్టీ అభ్యర్థినే గెలిపించారు. నంగాగ్వా తన సమీప ప్రత్యర్థి నెల్సన్‌ చామిసాపై విజయాన్ని నమోదు చేశారు. కాగా, 1980లో బ్రిటన్‌ నుంచి జింబాబ్వే స్వాతంత్య్రం పొందిన తర్వా త తొలిసారి నంగాగ్వా హయాంలోనే పార్టీ బలోపేతమైంది. అంతేగాక మంగాగ్వా తొలిసారి పూర్తికాలం పదవిలో ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు.

Spread the love